అనంతపురం

కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల బంద్ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూలై 5: కరవు జిల్లాలోని అన్ని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో 50 శాతం ఫీజులు రాయితీ ఇవ్వాలని రిజర్వేషన్ల విద్యార్థి ఫెడరేషన్ మూడు రోజుల బంద్ చేపట్టామని, రెండు, మూడవ రోజు బంద్‌ను నిలుపుదల చేస్తున్నట్లు ఆర్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌యాదవ్ తెలిపారు. గురువారం స్థానిక ఆర్‌పీఎస్ జిల్లా కార్యాలయంలో ఆర్‌పీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఓబిలేసుతో కలసి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 4న జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా నిర్వహించామని, 5న నిర్వహిస్తున్న సమయంలో రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీతను ఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.నాగరాజు కలవడం జరిగిందని, మంత్రి కలెక్టర్, విద్యా శాఖాధికారులతో ఫోన్లో మాట్లాడటం జరిగిందన్నారు. కలెక్టర్ అధ్యక్షతన విద్యా శాఖాధికారులు, కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలతో సమావేశం నిర్వహించి ఫీజుల నియంత్రణపై నిర్ణయించడంతో బంద్‌ను నిరవధికంగా నిలుపుదల చేస్తున్నామని తెలిపారు.
గణిత ల్యాబ్ మాన్యువల్ ఆవిష్కరణ
అనంతపురం సిటీ, జూలై 5: జేఎన్‌టీయూలోని గణిత విభాగంలో ఆర్‌ఎం రెగ్యులేషన్‌లో గణిత ల్యాబ్‌ను గురువారం ఆవిష్కరించినట్లు ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య రామానాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ల్యాబ్ ద్వారా ఇంజినీరింగ్ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుతుందని తెలిపారు. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలోని మొదటి, రెండవ సెమిష్టర్ గణిత ల్యాబ్‌ను పరిచయం చేయడం జరిగింది. ఈ ల్యాబ్‌లో ఎస్‌పీస్‌ఎస్, ఓరీజిమన్, మాట్ ల్యాబ్, ఆర్ ల్యాబ్ సాఫ్ట్‌వేర్స్‌కు ఉపయోగిస్తారని తెలిపారు. దీనివలన ఇంజనీరింగ్ విద్యార్థులకు బ్యాచ్‌లర్ డిగ్రీలోనే గణితంవంటి అనువర్తనాలు ఎక్కడ ఉపయోగించవచ్చు అన్న అవగాహనను కలిగి వుంటారన్నారు. దీనిపై వివిధ అంశాలపై మ్యాథమెటిక్స్ ప్రధానాచార్యులు ఆచార్య కేశవరెడ్డి రూపొందించిన అంశాలను కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య దేవకుమార్‌లు ఆవిష్కరించారు.
8న కాంట్రాక్టు లెక్చరర్ల సమావేశం
అనంతపురం సిటీ, జూలై 5: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ఈ నెల 8వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నట్లు కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రామాంజినేయులు తెలిపారు. గురువారం స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గత 18 సంవత్సరాలు పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తూ ఉత్తమ ఫలితాల కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. కానీ కాంట్రాక్టు అధ్యాపకులకు అరకొర వేతనాలతో కుటుంబాన్ని నెట్టలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా కాంట్రాక్టు లెక్చరర్స్‌ను రెగ్యులరైజ్ చేయాలని, అపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అందుకు ఈ నెల 8న గుంటూరులో సమావేశం ఏర్పాటుచేశామని, జిల్లాలో కాంట్రాక్టు అధ్యాపకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.