విజయనగరం

16మోడల్ స్కూల్స్‌ను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, జూలై 5: బొబ్బిలి సబ్ డివిజన్ పరిధిలో 16 మోడల్ స్కూల్స్‌ను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని బొబ్బిలి డిప్యూటీ డీఇఓ కె వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఏపీ మోడల్ స్కూల్ ఏడీగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు బొబ్బిలి డిప్యూటీ డీఇఓగా గురువారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మోడల్ స్కూల్స్‌ను జూనియర్ కళాశాలలుగా మారుస్తున్నామన్నారు. ఇప్పటికే 80శాతం పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు అందించామన్నారు. అలాగే ఏకరూప దుస్తులను కూడా అందిస్తున్నామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయుల సమయపాలనపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఎన్‌సీసీ, స్కౌట్స్, డ్రిల్‌ను పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు కృషి చేస్తామన్నారు. గురుకుల పాఠశాలలో డిజిటల్ క్లాస్‌లను ప్రారంభిస్తున్నామన్నారు. విద్యాప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని, ఇందుకు ఉపాధ్యాయులంతా సహకరించాలని కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో వౌళిక వసతులు కల్పిస్తామన్నారు.

ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు తల్లిదండ్రులు కూడా సహకరించాలి
బొబ్బిలి, జూలై 5: ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పిల్లల తల్లిదండ్రులు కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైన ఉందని యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయగౌరి పిలుపునిచ్చారు. పట్టణ పరిధిలో ఉన్న ఇందిరమ్మకాలనీలో పురపాలక పాఠశాలను ప్రారంభించి 3 సంవత్సరాల పూర్తికావడంతో విద్యార్థులకు గురువారం పుస్తకాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడేళ్లక్రితం ఈ కాలనీకి చెందిన పిల్లలు దూరంగా ఉన్న బొబ్బిలిలోని పాఠశాలలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సర్వేచేసి అధికారులకు విన్నవించిన మేరకు ఇక్కడ పాలకవర్గం పాఠశాలను మంజూరుచేసిందన్నారు. ఈమేరకు ఈ పాఠశాలలో అధికశాతం విద్యార్థులుగా మారుతుండటం అభినందనీయమన్నారు. అలాగే 7నెలలో శాశ్వత భవనాన్ని కూడా నిర్మించామన్నారు. 85మంది విద్యార్థులకు పాఠశాల గదులు చాలడం లేదని, అదనంగా మంజూరుచేయాలని డిమాండ్ చేశారు. ఈ పాఠశాలను యుటి ఎఫ్ దత్తత తీసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యాపరిరక్షణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యుటి ఎఫ్ నాయకులు సత్యనారాయణ, రాధాకృష్ణ, చంటి, శంకరరావు, తదితరులు పాల్గొన్నారు.

అట్టహాసంగా సామూహిక గృహప్రవేశాలు
మక్కువ, జూలై 5: ఎన్‌టిఆర్ గృహపథకం కింద నిర్మించిన నూతన గృహాలను గురువారం ప్రారంభించారు. ఈ మేరకు మండలంలోని ఏ వెంకంపేట, మేళాపువలస, మక్కువ, డబ్బూరివలస, శంబర, తదితర గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గృహాలను జన్మభూమి కమిటీ అధ్యక్షులు పెంట తిరుపతిరావు ఆధ్వర్యంలో హౌసింగ్ ఏఇ అప్పారావు, సిబ్బంది ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్‌టి ఆర్ గృహపథకం కింద 800 ఇళ్లు మంజూరవ్వగా సుమారు 378 ఇళ్లును ప్రారంభించారు. మిగిలిన గృహాలను కూడా త్వరితగతిన నిర్మించి ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గృహాలు, పింఛన్లు, రేషన్‌కార్డులు, తదితర వాటిని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శంబర పిహెచ్‌సీ ఛైర్మన్ తీళ్ల పోలినాయుడు, చొక్కాపు బుచ్చినాయుడు, రామారావు, డాక్టర్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.