ఐడియా

పెరటి తోట చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లం: అల్లం చిన్న పిల్లలు, పెద్దవారిలో కాని పైత్యం లాంటి వాటికి విరుగుడుగా పనిచేస్తుంది. అల్లాన్ని టీలోకానీ, లేదా అల్లం రసంగాని తీసుకున్నట్టయితే చిన్నపిల్లల్లో ఏర్పడే నులిపురుగులను దూరం చేయవచ్చు. అల్లం రసాన్ని జలుబు చేసినపుడు తగు మోతాదులో తీసుకుంటే జలుబు మటుమాయం అవుతుంది. చిన్న కణుపు వున్న అల్లం ముక్కను మట్టిలో పాతితే ఒక వారంరోజుల్లోనే మళ్లీ అది పిలకవేస్తుంది.
తులసి: కృష్ణ, లక్ష్మి, విష్ణు తులసి మొక్కల్లో ఏ రకం తులసి మొక్క అయినా సర్వరోగ నివారిణిగానే వుంది. తులసి ఆకులవల్ల తలనొప్పి, జలుబు లాంటివి దూరం అవుతాయి. పసిపిల్లలకు అంటే నెలలపిల్లవాళ్లకు తులసి రసాన్ని ముక్కులో వేయడం లేదా ముక్కుకు రాయడం చేస్తే వారికి మంకుగా పట్టిన జలుబు కూడా దూరం అవుతుంది. తులసి పూసలు ధరిస్తే మానసిక రోగాలను దూరం అవుతాయ. యాంటీ బయాటిక్‌గా తులసి పని చేస్తుంది. తులసి టీ, తులసి రసాన్ని సేవించిన వారికి శ్వాసకోస సంబంధ జబ్బులు దూరం అవుతాయి. తులసినుంచి తీసిన నూనె అన్నిరకాల వాపులను, నొప్పులను తగ్గించడంలో మేలైన మందుగా పనిచేస్తుంది కర్పూరం, తులసి నూనె రాసుకున్న వారికి తలనొప్పి, కాళ్లనొప్పులు లాంటివి రావు. దగ్గు తగ్గించడంలో తులసికి మించిన మందులేదు.
అలోవేరా: సౌందర్యం పెంచుకోవడానికి అన్నివిధాల ఉపయోగపడే మొక్క. చర్మ వ్యాధులను దూరంచేస్తుంది. అలోవెరా ఆకుల్లో వుండే జిగురు పదార్ధం చర్మంపైన వచ్చే కురుపులకు, చిన్న చిన్నదద్దుర్లకు పూస్తే మళ్లీ రావు. కురుపుల వల్ల ఏర్పడిన మచ్చలు కూడా కరిగిపోతాయి. ఈ ఆకులో వుండే జిగురును వేడిచేసి దీనికి తేనె కలిపి తీసుకుంటే జీర్ణకోశ వ్యాధులు కూడా దూరం అవుతాయి. మలబద్ధక నివారిణిగా అలోవిరా రసం పనికివస్తుంది. అలోవిరాను రోజూ ముఖానికి, చేతులకు పూసుకుంటే ఎండ తీవ్రతవల్ల ఏర్పడిన నల్లని మచ్చలుపోయి చర్మం కాంతివంతం అవుతుంది.
మెంతి: మెంతి ఆకులను రోజూ వంటలో ఉపయోగించినా, మధుమేహరోగులు కూరగా తీసుకున్నా వారి మధుమేహం దూరం అవుతుంది. తినడానికి చేదుగా వున్నా దీనిలో వెల్లుల్లి, నీరుల్లి, టమాటాలు వేసి కూర చేసి తింటే రుచికరంగా ఉంటుంది. పైగా జీర్ణకోశ వ్యాధులు, లివర్ జబ్బులను దూరం చేస్తుంది. లివర్ కాన్సర్‌ను కూడా దూరం చేస్తుంది. .మెంతి ఆకులను పేస్టుగా చేసి తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది.
కొత్తిమీర : కొత్తిమీర తీసుకోవడంవల్ల తల తిరగడం, కళ్లు తిరగడం లాంటి సమస్యలు దూరం అవుతాయి. శరీరానికి కావాల్సిన ప్రోటీన్ల తయారీలో కొత్తమీర పనికివస్తుంది. కొత్తిమీరతో కడుపులో వికారం, నొప్పులు దూరం అవుతాయి. కంటికి సంబంధించిన వ్యాధులను నయం చేస్తుంది. థైరాయడ్ సమస్యను కూడా దూరం చేస్తుంది.
పుదీనా: పుదీనా తో మూత్రకోశ వ్యాధులు దూరం అవుతాయి. వేసవి కాలంలో పుదీనా వేసి మరిగించి చల్లార్చిన నీరు కానీ, మంచినీటిలో పుదీనా ఆకులు వేసిన నీటిని తీసుకుంటే ఎండ గాల్పులనుంచి రక్షించుకోవచ్చు. చలువ చేస్తుంది. క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. కడుపులో గాస్‌ను దూరం చేస్తుంది.
వెల్లుల్లి, నీరుల్లి: వెల్లుల్లిని తీసుకునేవారికి గుండె వ్యాధులు దరిచేరవు. స్ర్తిలలో వచ్చే రుతు సంబంధ వ్యాధులు, మైగ్రేన్ వంటి తలనొప్పులు కూడా దూరం అవుతాయి. రోజూ కాసిని వెల్లుల్లి రెబ్బలను పరగడుపున తీసుకొంటే అనారోగ్యం కలుగదంటారు.

-జంగం శ్రీనివాసులు