శ్రీకాకుళం

పేదరికం లేని సమాజం నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట,జూలై 6: పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని స్థానిక శాసన సభ్యుడు బగ్గు రమణమూర్తి కితాబు నిచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం పింఛనుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదరికం నిర్మూలించడానికి అన్ని వర్గాలకు ఆయా వర్గాల ఆచార వ్యవహారాల మేరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని సోదాహరణంగా వివరించారు. ప్రతీ వ్యక్తి ఇతరులపై ఆధారపడకుండా సామాజిక భద్రతా పింఛనులను మంజూరీ చేస్తున్నామని స్పష్టం చేసారు. విభజన అనంతరం సావకోట మండలంలో ఇప్పటివరకు పలు విడతలుగా 1518మంది లబ్ధి దారులకు అదనంగా పింఛన్ సౌకర్యం కల్పించామన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సామాజిక భద్రతా పింఛన్ మంజూరీ చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా 53 మంది లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన పింఛనులను ఆయన అందజేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఈశ్వరరావు, తహశీల్దార్ ఈశ్వరమ్మ, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సాధుచిన్నిక్రిష్ణమనాయడు, నరసన్నపేట ఏ ఎంసీ చైర్మన్ బైరి భాస్కరరావు, స్థానిక పి ఏసి ఎస్ అధ్యక్షుడు నక్కరామరాజు, ఎంపీటీసీ కోన వెంకటేశ్, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మూకళ్ల చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

మరుగుదొడ్లు నిర్మాణం పనులును పూర్తిచేయాలి
* ఈవోపీఆర్‌డి రవికుమార్
పోలాకి,జూలై 6: మండలంలోగల 31 గ్రామ పంచాయతీల్లో ముందు ప్రారంభించినటువంటి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణ పనులను పూర్తి చేయాలని పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పంచాయతీల్లోను ఎవరెవరికి మరుగుదొడ్లు నిర్మాణ పనులు పూర్తి చేసే బాధ్యత అప్పజెప్పామో వారు సత్వరమే పరిమితిని పూర్తి చేయాలన్నారు. ఇంకా మిగిలియున్న వాటిని మాయొక్క దృష్టికి తీసుకురావాలని అందుకు తగిన కారణాలను తెలియజేయాలని ఆయన అన్నారు. గతంలో గ్రామాల్లో సర్వేచేసి ఇప్పటికీ కట్టని వారి లిస్టును తయారుచేయడం జరిగిందని, అటువంటి వారిపట్ల మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారని ఆయన అడిగారు. ఇప్పటికైనా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పనులు పూర్తి చేసి ఓడీ ఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ లక్ష్మి, ఫల్గుణరావు, శంకరరావు తదితర పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.