క్రైమ్/లీగల్

నిన్న అక్కడ.. నేడు ఇక్కడ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జూలై 6: రెండురోజుల కిందట కందుకూరు డివిజన్‌లోని తర్లుపాడు మండలంలో సుమారు 300 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోగా 24 గంటలు గడవకముందే మార్కాపురం పట్టణంలో 310 బస్తాల రేషన్ బియ్యాన్ని, లక్షా 5వేల రూపాయల నగదు, కాటా మిషన్, లారీని స్వాధీనం చేసుకున్న సంఘటన గురువారం అర్థరాత్రి జరిగింది. పట్టణ ఎస్సై జి కోటయ్య కథనం మేరకు పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీలోని పాతసబ్బుల ఫ్యాక్టరీలో అక్రమంగా నిల్వ ఉంచి లారీలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 310 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈసంఘటనా స్థలంలో నలుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి లక్షా 5వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే కాటా మిషన్, ఎలక్ట్రానిక్ కాటా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముందస్తు సమాచారం రావడంతో ఆప్రాంతాన్ని చుట్టుముట్టి తరలించేందుకు సిద్ధంగా ఉన్న లారీతోపాటు 310 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఈవిషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించామని తెలిపారు. డ్రైవర్ శేఖర్‌రెడ్డితోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, గత రెండురోజుల కిందట మార్కాపురం పట్టణానికి 10కిలోమీటర్ల దూరంలోగల తర్లుపాడులో ఓ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సంఘటనలో విచారణ జరుగుతున్న సమయంలోనే మరో అజ్ఞాతవ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పట్టణంలోని భగత్‌సింగ్ నగర్‌లో 310 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వ్యాపార లావాదేవీల్లో వచ్చిన విభేదాల కారణంగానే ఒకరిపై ఒకరు సమాచారం ఇచ్చి ఈ దాడులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ బియ్యం అక్రమ మార్గంలో తరలడం శోచనీయం.