శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నిధులు దుర్వినియోగం జరగలేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయుడుపేట, జూలై 6: నాయుడుపేట నగర పంచాయతీలో నిధులు దుర్వినియోగం జరగలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు నిరూపించకలిగితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమేనా అని మున్సిపల్ పాలక వర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్‌లీడర్ ఎస్‌కె రఫీ సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన నివాసంలో విలేఖర్లతో మాట్లాడుతూ ఇటీవల నగర పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నగర పంచాయతీ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరాతీశారు. రికార్డులు పరిశీలించి నిధులు దుర్వినియోగం జరిగినట్లు అధికారులను నిలదీశారు. దీంతో టీడీపీ నాయకులు ఎమ్మెల్యేపై చేసిన విమర్శలకు రఫీ స్పందించారు. నగర కమిషనర్ తన సొంత హోదాను ఉపయోగించి సుమారు కోటి రూపాయల నగదు డ్రా చేసినట్లు తెలిపారు. గతంలో అభివృద్ధి పనుల్లో భాగంగా తమకు అనుకూలమైన కాంట్రాక్టర్ల ద్వారా రూ.60 లక్షలు గోల్‌మాల్ చేసినట్లు ఆరోపించారు. దళిత కాలనీల అభివృద్ధికి కేటాయించిన నిధులను పట్టణంలోని టీడీపీ వార్డుల్లోనే వినియోగించారని ఆరోపించారు. మంత్రి నారాయణ హైస్కూల్ ఉన్నచోట చేపట్టిన కాంక్రీటు పనులన్నీ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతోనే అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలను 80 రోజుల నుంచి రికార్డులకు ఎక్కించలేదని తెలిపారు. తాను గెలుచుకున్న 16, 17, 18 వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టడం లేదని 50 నెలలుగా చెప్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని తెలిపారు. డ్రైనేజి కాలువల్లో పూడికతీతకు కాంట్రాక్టులు పిలిచినట్లుగా నిధులు డ్రా చేసి ఉన్నారని ఆరోపించారు. చెత్తను తొలగించడానికి బాడుగ ట్రాక్టర్ల పేరుతో సంవత్సరానికి రూ.24 లక్షలు కొల్లగొట్టారని ఆవేదన చెందారు. తాను చేస్తున్న ఆరోపణలపై ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమేనని, మున్సిపాలిటీలో అవినీతి జరగలేదని నిరూపించుకోగలిగితే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్‌కె జరీనా, వరకళాచంద్ర, నాయకులు అనురాధ, బల్లి కిరణ్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.