శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 6: అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం వెలగపూడి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లను ఉద్ధేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో 16 అవార్డులను రాష్ట్రం సాధించిందని, వృద్ధిరేటు కూడా 10.5 శాతం నమోదయిందని తెలిపారు. అధికార, అనధికారులను ప్రోత్సహించడం ద్వారా ఇది సాధ్యమైందని అన్నారు. రియల్ టైం గవర్నెన్స్, ఇ-ప్రగతి, పరిష్కార వేదికలు మంచి ఫలితాలు ఇచ్చాయని, సాంకేతికను అందిపుచ్చుకుంటే సత్వర అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. అభివృద్ధిలో ఉద్యోగులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నామని, తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధిబాటలో నిలపాలన్నారు. భూగర్భ జలాలను పెంచటం, నదుల అనుసంధానం తదితర అంశాలపై ప్రత్యేకదృష్టి నిలపామని, వౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. విద్యుతుత్పాదన 22.5 మిలియన్ మెగవాట్లుగా ఉందని, కరెంట్ చార్జీలు తగ్గించే స్థాయిలో ప్రభుత్వముందని ఆయన తెలిపారు. అంతకుముందు ఇన్‌చార్జ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా రాష్ట్రప్రగతిని వివరించారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్-2 కమలకుమారి తదితరులు పాల్గొన్నారు.