శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మున్సిపల్ కళాశాలలో మరో 60 మంది విద్యార్థులకు అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, జూలై 6: నగరపాలక సంస్థ జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలో మరో 60 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను మంత్రి సందర్శించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని విద్యార్థులకు మరో అదనపు తరగతి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు, జెడ్పీ, ఎయిడెడ్ స్కూల్లో చదివిన విద్యార్థులకు మాత్రమే అవకాశం అన్నారు. ఈ సమావేశంలో ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు దాసరి రాజేష్, పిట్టి సత్యనాగేశ్వరరావు, కమిషనర్ అలీమ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

9మంది సీఐలు బదిలీ
వేదాయపాళెం, జూలై 6: సౌత్ కోస్టల్ జోన్, గుంటూరు రేంజ్ పరిధిలోని గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పనిచేస్తున్న తొమ్మిదిమంది సీఐలను బదిలీ చేస్తూ గుంటూరు జోన్ ఐజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రేంజ్ వీఆర్‌లో ఉన్న పి.కృష్ణయ్యను పీసీఆర్ గుంటూరు అర్బన్‌కు, రేంజ్ వీఆర్‌లో ఉన్న ఎన్.శ్రీనివాసరెడ్డిని డీటీసీ ఒంగోలుకు, డీటీసీ ఒంగోలులో పనిచేస్తున్న ఆర్‌ఎస్ కిషోర్‌కుమార్‌ను సీసీఎస్ ఒంగోలుకు, రేంజ్ వీఆర్‌లో ఉన్న శ్రీనివాసరావును కొత్తపట్నం మెరైన్ పోలీస్‌స్టేషన్‌కు, సీసీఎస్ నెల్లూరులో పనిచేస్తున్న కె.సీ.హెచ్.రామారావును దుగరాజపట్నం మెరైన్ పోలీస్‌స్టేషన్, దుగరాజపట్నంలో పనిచేస్తున్న పి.కిషోర్‌బాబును రేంజ్ వీఆర్‌కు బదిలీ చేసారు. కందుకూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.నరసింహారావును నెల్లూరు ఐదవ నగర పోలీస్‌స్టేషన్‌కు, నెల్లూరు ఐదవ నగర స్టేషన్‌లో పనిచేస్తున్న జి.మంగారావును రేంజ్ వీఆర్‌కు, నెల్లూరు ఆరవనగర పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న జి.సంగమేశ్వరరావును కనిగిరి సర్కిల్‌కు బదిలీ చేశారు.

ఎస్‌ఎస్ కాలువ పూర్తి చేయాలంటూ త్వరలో పాదయాత్ర
* జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి
వెంకటగిరి, జూలై 6 : సోమశిల స్వర్ణముఖ కాలువ ఏ ఏ గ్రామాల సమీపంలో వెళుతుందో ఆయా గ్రామాల్లో త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్, వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని బొమ్మిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ పానలో రూ.500 కోట్లతో శంఖుస్థాపన చేసిన ఎస్‌ఎస్ కాలువ పనులకు రూ.100 కోట్లు ఖర్చుచేసి అధికార పార్టీ నిరుపయోగంగా వదిలివేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో కూడా చర్చించినట్లు తెలిపారు. ఆగిన ఎస్‌ఎస్ కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఎస్‌ఎస్ కాలువ నిర్మాణం జరుగుతున్న సమీప గ్రామాల్లో త్వరలోనే పాదయాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. ఎన్నికలు అక్టోబర్, నవంబర్‌లో గాని, మార్చి, ఏప్రిల్‌లోగాని వస్తే బూత్‌స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. వెంకటగిరి పట్టణంతో పాటు అన్ని మండలాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రోజుకోవిధంగా ఊహాగానాలు వస్తుంటాయిని, వాటికి నాయకులు, కార్యకర్తలు ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు అందరు కృషి చేయాలన్నారు. వెంకటగిరిలో వైకాపా ఎమ్మెల్యే లేకపోయినా ఆ లోటు తీర్చానని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిల్లీబాబు, నక్కా వెంకటేశ్వర్లు, చిట్టేటి హరికృష్ణ, గిరిరెడ్డి, ఆర్జున్‌గారి మురళీ, గురునాథం, ధనియాలరాదమ్మ, రాజేష్, మల్లికార్జున్‌రెడ్డి, పాకనాటి రాజామణి తదితరులు పాల్గొన్నారు.