క్రీడాభూమి

ఉరుగ్వేకు ఉరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**గ్రీజ్‌మన్ రెచ్చిపోయాడు. ఫ్రాన్స్‌ను సెమీస్‌కు చేర్చాడు. లూయిస్ సురేజ్ విఫలమయ్యాడు. ఉరుగ్వేను ఇంటికి పంపేశాడు. ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ తొలి మ్యాచ్ నిజ్ని నోవ్‌గొరోడ్ మైదానంలో వన్‌సైడ్‌గా సాగిపోయింది. సంచలనాల ఉరుగ్వేను పూర్తిగా కట్టడిచేసిన ఫ్రాన్స్ అప్రతిహత విజయాన్ని కైవసం చేసుకుంది. ప్రత్యర్థి ఆటగాళ్లను తన గోల్‌పోస్ట్‌వైపు కనీసం కనె్నత్తికూడా చూడకుండా కట్టడి చేసేంది. దక్షిణ అమెరికా జట్లు తమపై విజయం సాధించడం అసాధ్యమన్న రికార్డును మరోసారి బంతి బద్దలుకొట్టి మరీ నిరూపించింది. ఆలస్యమైనా అద్భుతమైన తొలి గోల్‌తో రాఫెల్ వరానే ఫ్రాన్స్‌కు గొప్ప వరాన్ని అందిస్తే, ఆశలు వమ్ము చేసేది లేదంటూ ఆంటోనీ గ్రీజ్‌మన్ ఘనమైన ముగింపునిచ్చాడు. ఊపుమీదున్న ఉరుగ్వే జట్టులో చెలరేగిపోతారనుకున్న లూయిస్ సురేజ్, కిలియన్ ఎంబప్పెలు ఫ్రాన్స్ ఆటగాళ్లముందు నిలబడలేకపోయారు. ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌వైపు కనె్నత్తి చూడటానికి కూడా అవకాశం రాక, పేలవమైన ఆటతో ఉరుగ్వేకు ముగింపు పలికారు. విజయం సాధించిన ఫ్రాన్స్ సెమీస్‌కు వెళ్లింది. ఉరుగ్వే మాత్రం ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.
=================================================================

నిజ్ని నోవ్‌గొరోడ్, జూలై 6: ఫైనల్ ‘్ఫర్’లో బెర్త్ కోసం నిజ్ని నోవ్‌గొరోడ్ మైదానంలో ఫ్రాన్స్-ఉరుగ్వేలు తలపడ్డాయి. మ్యాచ్ హోరాహోరీగా మొదలైనా, కొద్ది నిమిషాలకే బంతి ఫ్రాన్స్ నియంత్రణలోకి వచ్చేయడంతో ఉరుగ్వేకు అష్టకష్టాలు మొదలయ్యాయి. దుర్భేధ్యమైన ఫ్రాన్స్ రక్షణ వలయాన్ని దాటి గోల్‌పోస్ట్‌వైపు పరుగులు పెట్టడం ఉరుగ్వే ఆటగాళ్లకు సాధ్యంకాలేదు. జట్టు మొత్తం ఆశలు పెట్టుకున్న స్టార్ ఆటగాళ్లు సురేజ్, ఎంబప్పెలు సైతం ఫ్రాన్స్ ధాటిముందు నిలవలేకపోయారు. ఆట మొత్తం ఫ్రాన్స్ ఆడేస్తుంటే, చోద్యం చూడటం తప్ప మరేమీ చేయలేకపోయారు. అయినప్పటికీ మ్యాచ్ మొదలైన 40 నిమిషాల వరకూ ఫ్రాన్స్‌కు సైతం గోల్ సాధ్యం కాకపోవడంతో ఉత్కంఠ రేకెత్తింది. 40వ నిమిషంలో ఫ్రాన్స్‌కు రాఫెర్ ‘వరాన్ని’చ్చాడు. ప్రత్యర్థి ఉరుగ్వే ఆటగాళ్లకు అంతుచిక్కని విధంగా గ్రీజ్‌మన్ తన ఫ్రీకిక్‌తో మిడ్ ఫీల్డ్‌లోని రాఫెల్‌కు బంతిని పాస్ చేయడంతో, రాఫెల్ దాన్ని సమర్థంగా వాడుకున్నాడు. క్షణాల్లో ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లోకి బంతిని తరలించి ఫ్రాన్స్‌ను 1-0 ఆధిక్యానికి తీసుకెళ్లాడు. ఫ్రాన్స్‌కు రాఫెల్ గోల్ చేయడం ఇది మూడోది. అందించిన గోల్స్ అన్నీ హైడెర్సే అయితే, అందులో రెండు గ్రీజ్‌మన్ ఇచ్చిన పాస్‌తో సాధించినవే. తొలిగోల్ ప్రత్యర్థికి ఇచ్చిన ఉరుగ్వే, పదహారు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో నెగ్గిన దాఖలాలు లేవు. ఈ సెంటిమెంటే ఉరుగ్వేపై బలంగా పని చేసింది. తీవ్ర వత్తిడికి గురైన ఉరుగ్వే ఆటగాళ్లు ఫ్రాన్స్‌ను నిలువరించలేక చేతులెత్తేశారు. అలాంటి పరిస్థితి కోసమే ఎదురు చూస్తున్న గ్రీజ్‌మన్ 61వ నిమిషంలో అద్భుత గోల్ సాధించి ఉరుగ్వేపై పూర్తిగా వత్తిడి పెంచాడు.
గ్రీజ్‌మన్ లెఫ్ట్ఫూట్ షాట్‌ను అడ్డుకునేందుకు ఉరుగ్వే గోల్‌కీపర్ చేసిన ప్రయత్నంలో చిన్న పొరబాటు కారణంగా నేరుగా బంతి గోల్‌పోస్టులోకి వెళ్లిపోయింది. ఈ గోల్‌తో నాకౌట్‌కు చేరుకున్న ప్రపంచకప్ మ్యాచుల్లో 7 గోల్స్ సాధించిన ఆటగాడిగా గ్రీజ్‌మన్‌కు రికార్డు దక్కింది. జావగారిపోయిన ఉరుగ్వే ఇక ఏమాత్రం పోరాట పటిమ ప్రదర్శించలేకపోయింది. మిగిలిన మ్యాచ్ టైం, ఇంజ్యురీ టైంలోనూ ఫ్రాన్స్‌ను ప్రతిఘటించలేకపోయిన ఉరుగ్వే, అసలు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌వైపే వెళ్లలేకపోయింది.
దీంతో ప్రపంచకప్ పోరులో ఆరోసారి ఫ్రాన్స్ సెమీస్‌కు చేరింది. 1998, 2006 ప్రపంచకప్ పోరులో ఫైనల్‌కు దూసుకెళ్లిన ఉత్సాహానే్న ఇప్పుడు మరోసారి ఫ్రాన్స్ ప్రదర్శిస్తోంది. పది ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో దక్షిణ అమెరికా దేశాల జట్ల చేతిలో ఒక్క ఓటమినీ చవిచూడని విజయగర్వంతో ఫ్రాన్స్ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఫ్రాన్స్ విజయంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.