క్రైమ్/లీగల్

యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడుతూరు, జూలై 6:మండల పరిధిలోని జలకనూరు గ్రామానికి చెందిన దేవన్న కుమారుడు దేవదాసు(28) అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అలగనూరు రిజర్వాయర్ కట్టపై గత రెండు రోజులుగా ఒక బైక్, పక్కనే చెప్పుల జత వుండడంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం, సిబ్బంది రిజర్వాయర్‌ను పరిశీలించగా నీటిలో తేలాడుతున్న శవం కన్పించింది. దీంతో శవాన్ని బయటకు తీసి విచారించగా జలకనూరు గ్రామస్థుడిగా గుర్తించారు. కాగా దేవదాసు బెంగళూరులో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేసేవాడని, ఇటీవల ఇంటికి వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుందని, మృతుడి తండ్రి దేవన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.