అనంతపురం

అన్న క్యాంటీన్ల నిర్మాణాల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం టౌన్, జూలై 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్ల నిర్మాణం పనులు వచ్చే వారం లోగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని కమిషనర్ పీవీవీవీఎస్ మూర్తి షాపూర్‌జీ-పల్లోంజీ కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. శనివారం కమిషనర్ మూర్తి, అన్న క్యాంటీన్ల నోడల్ ఆఫీసర్, ఈఈ రామ్మోహనరెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ ప్రసాద్, డీఈఈ సూర్యనారాయణలతో కలిసి పనుల ప్రగతిని పరిశీలించారు. కమిషనర్ మూర్తి మాట్లాడుతూ వచ్చే వారంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈమేరకు యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తిచేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. రాత్రింబవళ్ళు పనులు చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు.
అనంతపురం పోలీసు సబ్ డివిజన్‌పై సమీక్ష
అనంతపురం అర్బన్, జూలై 7: అనంతపురం సబ్ డివిజన్‌లో సమస్యాత్మక గ్రామాలపై డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ అశోక్‌కుమార్‌లు సంయుక్తంగా సమీక్ష నిర్వహించారు. శనివారం స్థానిక ఎస్పీ ఛాంబర్‌లో జరిగిన సమావేశానికి డీఐజీ ప్రభాకర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో అనేక సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయన్నారు. ఇక్కడ చోటు చేసుకొన్న కేసులను ఆయన సమీక్షించారు. గ్రామాల్లో నెలకొన్న పరిస్ధితులపై ఆరా తీశారు. ఏ చిన్న ఘటనలు జరక్కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు ప్రశాంతంగా జీవించేలే చైతన్యం చేయాలన్నారు.
చిన్నారులకు టీకాలు
నార్పల, జూలై 7: మండలంలోని తొమ్మిది ఉప ఆరోగ్య కేంద్రాల్లో చిన్నారులకు టీకాలు వేసినట్లు వైద్యాధికారిణి పుష్పలత తెలిపారు. శనివారం బి.పప్పూరు, నార్పల పీహెచ్‌సీల పరిధిలోని 32 గ్రామాలకు చెందిన చంటిబిడ్డలకు వైద్య చికిత్సలు నిర్వహించి, టీకా మందులు వేశామన్నారు. ప్రస్తుత సీజన్‌లో చిన్నారులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.
బ్యాగుల పంపిణీ
బుక్కరాయసముద్రం, జూలై 7: బుక్కరాయసముద్రం పంచాయతీ పరిధిలోని గాంధీనగర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అదే కాలనీకు చెందిన వైసీపీ నాయకురాలు మనేరి కొండమ్మ, ఆమె భర్త పరమేశ్‌లు విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.
వ్యవసాయ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోండి
నార్పల, జూలై 7: విద్యుత్ సర్కిల్ పరిధిలో ఆరు నెలలుగా నిలిపివేసిన వ్యవసాయ కనెక్షన్లను పునరుద్ధరించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. వ్యవసాయ కనెక్షన్లు కావాలనుకునే రైతులు ‘మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చుని నార్పల మండల ట్రాన్స్‌కో ఏఈ నజురుద్దీన్ శనివారం తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు.