రంగారెడ్డి

నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూలై 7: నేరస్తులకు శిక్ష పడేలా ప్రాసిక్యూటర్లు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌వోలు కృషి చేయాలని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వైజయంతి సూచించారు.
సైబరాబాద్ కమిషనరేట్‌లో కోర్టు కానిస్టేబుల్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమస్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైజయంతి ముఖ్యతిధిగా విచ్చేసి కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు, కోర్టు కానిస్టేబుళ్లకు ఎదురవుతున్న సమస్యలపై అవగాహన కల్పించారు.
కోర్టు డ్యూటీలో ఉన్న ఆఫీసర్లు ఎదుర్కొనే సమస్యలు, వాటిని ఎలా సమన్వయం చేసుకోవాలి, ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేటప్పుడు, రిమాండ్‌కు తీసుకుని వెళ్లేటప్పుడు తీసుకొవాల్సి జాగ్రత్తలు గురించి ఆమె వివరించారు. సైబరాబాద్‌లో వివిధ కేసులు ఛేదించడంలో ఎదురయ్యే సమస్యను సమన్వయతో ఎలా ఎదుర్కోవాలో వివరించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో నిందితులకు శిక్షపడేలా దర్యాప్తును శ్రద్ధగా చేయాలని చెప్పారు. ప్రతి మొదటి శనివారం పీపీల సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరచిన కోర్టు అఫీషాయల్స్‌కు, కోర్టు కానిస్టేబుల్స్ పీపీ వెంకటేశ్వర ప్రసాద్, ఏపీపీ గోపాల్, రాఘవేందర్, ప్రసన్న లక్ష్మి, జూబేదా, రాజేశ్‌లకు ప్రశంసా పత్రాలను అందిచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సీ.రాము, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, క్రైం డీసీపీ షర్మిలా, బాలనగర్ డీసీపీ సాయి శేఖర్, శంషాబాద్ డీసీపీ పద్మజా, కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, సీఐలు కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.