నల్గొండ

పేదల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతపల్లి, జూలై 7: నిరుపేదల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీ ఆర్ లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో 38 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను శనివారం ఆయన అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ఆడపడుచులందరికీ కేసీ ఆర్ పెద్దన్నగా నిలిచి కల్యాణలక్ష్మి పథకంతో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తోడ్పాటునందిస్తున్నారన్నారు. ప్రజాసంక్షేమ కోసం ఆసరా పింఛను, కేసీ ఆర్ కిట్, డబుల్ బెడ్రూం, తదితర పథకాలను అమలు చేస్తున్నారు.
అంతకుముందు పోలేపల్లి రాంనగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో గ్రామానికి చెందాని కాసోజు బ్రహ్మచారి 139 మంది విద్యార్థులకు విరాళంగా అందజేసిన బూట్లను ఆయన పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న గ్రామస్తులు, పాఠశాల నుండి ఆరుగురు విద్యార్థులు గురుకుల పాఠశాలలో సీట్లు పొందేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అభినంధించారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్, ఆర్ ఐ శ్యాంనాయక్, ఎం ఈవో గురువారావు, ప్రదానోపాధ్యాయుడు వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నాగభూషణం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భూపాల్, నాయకులు కిష్టారెడ్డి, నట్వ గిరిధర్, చేపూరి శ్రీనివాసచారి, సుమతిరెడ్డి, ఎండి. ఖాలేద్, అక్రం, విజయ్, తదితరులు పాల్గొన్నారు.