నల్గొండ

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాపేట, జూలై 7: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. శనివారం మండలంలోని రఘునాథపురం గ్రామంలో 13లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రజా సంక్షేమ పథకాలులో ముందంజలో ఉందన్నారు. రైతుల సంక్షేమ కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు పెట్టుబడి కష్టాలు లేకుండా చేశామని, అంతేకాకుండా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చి ఆత్మహత్యలు, అకస్మాత్తుగా మృతిచెందిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రైతుబీమా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈపథకం ద్వారా రైతుల కుటుంబాలకు ఐదు లక్షల బీమా వర్తిస్తుందన్నారు. ఇందులో భాగంగానే రాజాపేట మండలానికి గోదావరి జలాలను గంగమళ్ల రిజర్వాయర్ ద్వారా అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రామిడి నరేందర్, ఎంపీటీసి రాములమ్మ, ఎంపీపీ పులి సత్యనారాయణ, జడ్పీటీసీ రాజిరెడ్డి, ఎంపీడీవో రామరాజు, తహసీల్దార్ రామ్మూర్తి, ఉప సర్పంచ్ బాల్‌రాజు, మదర్‌డెయిరీ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, బిల్ల శ్రీను, భాస్కర్, దాచేపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
వ్యాపారులకు అండగా ఉంటాం
యాదగిరిగుట్ట రూరల్: పట్టణంలోని గ్రామపంచాయితీ షాపింగ్ కాంప్లెక్స్‌లో వ్యాపారం నిర్వహిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న పేద మద్యతరగతి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్‌రెడ్డి అన్నారు.శనివారం పట్టణంలోని తన నివాస గృహంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్‌రెడ్డిని కలిసిన వ్యాపారస్తులు వినతి పత్రాన్ని అందించారు.తమ గోడును పట్టించుకోవాలని దుఖానాల రెంట్లు అధికమైనాయని సంవత్సరానికోసారి రెంట్లు పెంచడంతో వ్యాపారాలు చేసుకోవడం కష్ట తరం అవుతుందని మూడు సంవత్సరాల గడువును పెంచాలని తెలిపారు.ప్రభుత్వ విప్ స్పందిస్తూ పేదల పక్షాణ నిలపడేందుకు ఎప్పటికీ ముందుంటామపని గడువు ను పెంచేందుకు అధికారులతో మాట్లాడతామని తెలిపారు. సంవత్సరానికోసారి లీజు గడువు పెంచడం టెండరు పెట్టడం వ్యాపారులకు ఇబ్బందులు కలుగుతాయని వ్యాపారాన్ని అభివృద్ది చేసుకునేందకు దోహద పడదని అన్నారు.మూడు సంవత్సరాలు గడువు పెంచితే వ్యాపారాభివృద్ది చేసుకుంటారని తద్వారా కుటుంబాలను పోషించుకుంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు గడ్డమీది రవీందర్‌గౌడ్,వార్డు సభ్యులు కాటబత్తిని అంజనేయులు,మిట్ట వెంకటయ్య, చిత్తర్ల బాలయ్య, గవ్వల రామస్వామి, వ్యాపారస్తులు కీసరి కిషన్, బబ్బూరి యాదగిరి,కొపాకల విఠల్,యేశమైన శ్రీశైలం,యాదగిరి, శ్రీను, ఎండీ హనీఫ్,వెంకటేష్,మహేష్,గడ్డమీది రాము పాల్గొన్నారు.
ఆడపడుచులకు అన్న కేసీఆర్
*తెలంగాణ సంక్షేమ పథకాల వైపే దేశం చూపు *ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

మర్రిగూడ, జూలై 7: పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కొనియాడారు. శనివారం మండలకేంద్రంలోని గుమ్మకొండ కొండల్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో అర్హులైన మహిళలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల దేశంలోని రాష్ట్రాలు తెలంగాణవైపే చూస్తున్నాయన్నారు. రైతుల కోసం, మహిళల కోసం, వృద్ధుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘతన తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. మండలంలో దరఖాస్తులు చేస్తున్న 34 మంది మహిళలకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేయడంతో పాటు వందకు పైగా కల్యాణలక్ష్మి దరఖాస్తులను పరిశీలించి సంతకాలు చేశారు. గతంలో భువనగిరి పార్లమెంటు స్థానం నుండి గెలుపొంది ఏమీ చేయలేక ఢిల్లీలో పైరవీలు చేస్తూ దోచుకొని దాచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పదే పదే మునుగోడు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ప్రకటించుకోవడం హాస్యాస్పదం అన్నారు. 45 కోట్లు వెచ్ఛించి ఎమ్మెల్సీగా గెలుపొందిన రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గానికి నాలుగు కోట్ల నిధులైనా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి టీ ఆర్ ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ అంబేద్కర్, పార్టీ మండల అధ్యక్షుడు జగదీశ్వర్, రైసస మండల కన్వీనర్ పాశం సురేందర్‌రెడ్డి, టీ ఆర్ ఎస్ నాయకులు బచ్చు రామకృష్ణ, లాలునాయక్, వెంకటయ్య, ఎడ్ల శ్రీరాములు, రాజునాయక్, గంటా కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.