Others

బొంబాయ మిఠాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బొంబాయి మిఠాయి...
బొంబాయి మిఠాయి...’
వాకిట్లో డొక్కు సైకిల్ పిల్లగాని సైరన్..
జ్ఞాపకాల తేనెతుట్టెల్ని కదిలిస్తూ
గొంతు చించుకుని అరుస్తున్నాడు

కిర్రు.. కిర్రు... చెక్క గిలక చప్పుడు
ఇంకా మూసుకుపోని ముప్పైయేండ్ల కిందటి
ఈస్ట్‌మన్ కలర్ సినిమాను చూపిస్తోంది
పాత సినిమా రీళ్ళలోని ఫ్రేముల్లా
అంతా... దృశ్యాదృశ్యమై కనిపిస్తోంది

ఇంట్లో ఎక్కడ ఏ మూలకు దాక్కున్నా
లోపలి అర్రలో ఆడుకుంటున్నా
చప్పుడు మాత్రం నాదస్వరంలా
అచ్చంగా... స్పష్టంగా వినిపించేది
పూజగదిలోని ‘తాత’ కోసమో
అరుగుమీద కూర్చున్న
‘ముసలవ్వ’ కోసమో కండ్లు వెదికేవి
పరిగెత్తుకుంటూ వెళ్ళి అడగగానే
బొడ్లెసంచిలకెల్లి తీసిచ్చిన
అయదు పైసలు... పదిపైసల బండి
అరచేతిలో కొలువైన
ముంబయ రిజర్వు బ్యాంకులా కనిపించేది

ఈ పిలగాండ్లు నమ్మరు గానీ
మూడు పైసలకే బాలనాగమ్మ రంగు
‘బొంబాయ మిఠాయ’ గడియారం
మణికట్టు మీద మిలమిల మెరిసేది
లక్షల నక్షత్రాలు కండ్లల్లో పూచేవి
ఇంకా
నడిమి వేలు మీద ఉంగరం
కొసరి కొసరి పెట్టించుకున్న
చిటికెన వేలు మీది చిన్న ఉంగరం
కొద్దికొద్దిగా చప్పరిస్తూ ఉంటే
తీయతీయని పాలసముద్రాలెన్నో
నాలుకమీద నర్తించినట్టుండేది

ఒక్కొక్కటి జ్ఞాపకమొస్తుంటే
బాల్యం నిన్న మొన్నటి
నిజంలా అనిపిస్తుంది
ఒక్కో దృశ్యం
మళ్ళీ కొత్తకొత్తగానే కనిపిస్తుంది

అన్నీ యాది చేసుకుంటూ
‘హైడీ’ని ఎత్తుకుని
‘బుడ్డిగాడు.. హనీ’లతో నడుస్తూ
పెద్ద బజార్, గాంధీచౌక్‌లోకి వస్తానా
అద్దాల సీసాల్లోంచి, దుకాణాల్లోని
క్యాండీ... లాలీపప్...
మ్యాంగో జెల్లీ... కిట్‌కాట్‌లు
నన్ను చూసి వెక్కిరిస్తూ ఉంటాయి..

- డా. పత్తిపాక మోహన్