నల్గొండ

బోధన్ బల్దియా చైర్మన్‌పై అవిశ్వాసం లేనట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, జూలై 13:బోధన్ బల్దియా చైర్మన్ పై అవిశ్వాస రాజకీయాలు ఎంత వేగంతో వేడెక్కాయో నిజామాబాద్ ఎంపీ కవిత చక్రంతో అదే స్పీడ్‌లో చల్లబడ్డాయి. అవిశ్వాసం పెట్టి తీరాల్సిందేనంటూ ఘంటా పథంగా చెప్పిన కౌన్సిలర్లు శుక్రవారం అవిశ్వాసం నోటీసును ఉపసంహరించుకునేందుకు సిద్ధమయ్యారు. అవిశ్వాసం పెట్టి చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామని కలలు గన్న ఎంఐఎం కౌన్సిలర్ల ఆశలు ఒక్కసారిగా నీరుగారిపోయాయి. శుక్రవారం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత బోధన్ బల్దియాకు చెందిన ఎంఐఎం కౌన్సిలర్లతో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ను కలిసి ఇక్కడి వ్యవహారంపై సుధీర్ఘంగా చర్చ జరిపారు. దళిత వర్గానికి చెందిన అనంపల్లి ఎల్లయ్య పై అవిశ్వాసం పెట్టడం సమంజసం కాదని ఈ వ్యవహారంలో ఎంఐఎం కౌన్సిలర్లు అనుసరిస్తున్న తీరు గురించి ఎంపీ కవిత ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌కు వివరించడం జరిగింది. అవిశ్వాసం వలన బల్దియాకు చెడ్డపేరు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో ఎంఐఎం అధినేత ఈ విషయమై తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో సమాలోచనలు జరిపి అవిశ్వాసం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దాంతో చైర్మన్ వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం బోధన్ బల్దియా అవిశ్వాస రాజకీయాలు హైదరాబాద్ నగరానికి చేరుకున్నాయి. చైర్మన్‌తో పాటు అధికార, విపక్షాలకు చెందిన కౌన్సిలర్లు బోధన్ శాసనసభ్యుడు షకీల్ అహ్మద్‌తో సమావేశమయ్యారు. ఇందులో అవిశ్వాసం గురించ సుదీర్ఘంగా చర్చించారు. కాగా ఆరుగురు ఎంఐఎం పార్టీకి చెందిన కౌన్సిలర్లతో ఎంపీ కవిత సమావేశమై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ను కలిసి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. ఒకవైపు ఎమ్మెల్యే షకీల్, మరోవైపు ఎంపీ కవితలు ఎవరికి వారు అవిశ్వాసం విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఈ నెల 25న జరుగాల్సిన అవిశ్వాసానికి తెరపడినట్లయ్యింది. అవిశ్వాస నోటీసును వెనక్కి తీసుకుంటామని ఎంఐఎం కౌన్సిలర్లు అధినేత వద్ద స్పష్టం చేయడంతో ఈ బల్దియా రాజకీయాలు పూర్తిగా చల్లబడినట్టేనని తెలుస్తోంది. అయితే ఎంఐఎం నిర్ణయానికి మద్ధతు పలికిన కాంగ్రేస్, బిజెపి కౌన్సిలర్లు మాత్రం అయోమయంలో పడాల్సి వచ్చింది. చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టాలన్న డిమాండ్ వలన ఇక్కడి తెరాసలో వారం రోజుల నుండి గలాటా నెలకొంది. సీనియర్, జూనియర్ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోవాల్సి వచ్చింది. మరోవైపు తెరాసలో కొనసాగుతున్న దళిత వర్గానికి చెందిన నాయకులంతా చైర్మన్ వంచన చేరారు. సీనియర్లు స్తబ్దంగా ఉండగా జూనియర్‌లు అవిశ్వాసాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ వ్యవహారంలో ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించాలని మరోవైపు దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఎట్టకేలకు ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ వ్యవహారంలో ప్రత్యేక చొరవ చూపడంతో ఒకే రోజులో బల్దియా రాజకీయం చల్లబడి పోయింది.

వికలాంగ ఓటర్లను గుర్తించాలి
- భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా
ఇందూర్, జూలై 13: ఓటరు జాబితాలో గల వికలాంగ ఓటర్లను గుర్తించాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా తెలుగు రాష్ట్రాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం న్యూఢిల్లీ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీఇఓ, టెక్నికల్ అదిధికారుతలో పాటు జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సందీప్ సక్సేనా మాట్లాడుతూ, స్పెషల్ సమ్మర్ రివిజన్‌లో భాగంగా పోటా ఓటర్ల జాబితా పరిశీలనకు ఇంటింటా సర్వే పూర్తయినందున, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. భారత ఎన్నికల సంఘం గతంలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం ఈఎంఆర్‌ఎస్ సిస్టమ్‌ను తొలగించి, దాని స్థానంలో నూతన సాంకేతిక వ్యవస్థ అయిన ఈఆర్‌ఓ ఎన్‌ఇటీను రూపొందించినట్లు తెలిపారు. ఈ వ్యవస్థా ద్వారా బూత్ స్థాయి అధికారుల నుండి భారత ఎన్నికల సంఘం అనుసంధానం ఉంటుందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఇఆర్‌ఓ ఎన్‌ఇటీపై పూర్తి అవగాహన ఇప్పటికే కల్పించినట్లు తెలిపారు. ఈ వ్యవస్థలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీఇఓలతో పాటు జిల్లా నియోజకవర్గ ఎన్నికల అధికారి (డీఇఓ, ఇఆర్‌ఓ)లకు ఎదురవుతున్న సమస్యలు, సందేహాల పట్ల డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సస్సేనా నివృత్తి చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భారత ఎన్నికల సంఘం కమిషనర్ శుక్ల, ఇఆర్‌ఓ ఎన్‌ఇటీ ప్రాజెక్టు డైరెక్టర్ త్యాగి, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సీఇఓ రజత్‌కుమార్, జిల్లా కరెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు, బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, డీఆర్‌డీఓ వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ వినోద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.