తెలంగాణ

సెప్టెంబర్ నాటికి బతుకమ్మ చీరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: దసరా పండుగను పురస్కరించుకొని మహిళలకు అందించనున్న బతుకమ్మ చీరలను సెప్టెంబర్ చివరి నాటికి అందించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. శనివారం బతుకమ్మ చీరల తయారీ, అపరెల్ ఎక్స్‌పోర్టు పార్క్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. డిమాండ్‌కు తగ్గట్టుగా చీరల తయారిని వేగవంతం చేయాలని సూచించారు. ప్రస్తుతం 10వేల పవర్‌లూమ్ యంత్రాలపై చీరలను తయారు చేస్తున్నట్టు అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా మరో 10వేల పవర్‌లూమ్‌లను అందుబాటులోకి తేవాలన్నారు.
గడువులోగా నిర్ధేశిత లక్ష్యాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నేతన్నల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. సిరిసిల్ల నేత కార్మికులకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనేలా చూడాలని మంత్రి అన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో శనివారం బతుకమ్మ చీరల తయారీ, పంపిణీపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్