తెలంగాణ

బీసీ జాబితాలోకి ఆ 30 కులాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తించని 30 బీసీ కులాలలోని సంచార జాతులను గుర్తించి వారిని బీసీ కులాల్లో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీ శంకర్ రాసిన బీసీ కులాలు, సంచార జాతులు అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఆవిష్కరించారు. సంచార జాతులకు చెందిన 30 కులాలను బీసీ కులాల జాబితాలో చేర్చాల్సి ఉందని గౌరీ శంకర్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ సంచార జాతులను బీసీ కులాల్లో చేర్చే అంశంపై అధ్యయనం చేయాల్సిందిగా రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బాధ్యత అప్పగించారు. బీసీ కులాల్లో సంచార జాతులకు సంబంధించిన అధ్యయనాన్ని ప్రదాన కార్యదర్శితో మాట్లాడిన తర్వాత బీసీ కమిషన్ అధ్యయనం చేస్తుందన్నారు. బీసీ కులాల్లో సారోల్లు, అర్వకోమటి, తోలుబొమ్మలాటవారు, కుల్లకడిగి, బైల్ కమ్మర, అహీర్, గోవి, బాగుతుల, బొప్పాల, గంజికూటి వారు, శ్రీ క్షత్రీయ రామజోగి, ఇనూటి, గుర్రపువారు, అడ్డాపువారు, సారగాని, కడారి తిడారోళ్ళు, ఓడ్, పాథంవారు, సాధనా శూరులు, రుంజా, పనాస, పెక్కర, పాండవులవారు, గొడజెట్టి, అదికొడుకులు, తెరచీరల, కాకిపడగల, మందహెచ్చుల, పప్పాల, సన్నాయిలు, బత్తిన కులాలకు చెందిన సంచార జాతులను బీసీ కులాల జాబితాలో చేర్చాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో ఎంపీలు కె. కేశవరావు, బోయినపల్లి వినోద్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీ శంకర్ రాసిన బీసీ కులాలు, సంచార జాతులు అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం కేసీఆర్