తెలంగాణ

ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: ప్రజలను మభ్యపెడుతూ ఆర్భాటంగా ప్రభుత్వం అనేక ప్రకటనలుచేస్తోందని, అవేవీ కార్యాచరణలో చూపించడం లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతోమాట్లాడుతూ రాష్ట్రంలో 12751 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు అట్టహాసంగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు వేగంగా ముందుకు వెళ్తున్నట్టు ప్రజలను మభ్యపెట్టిందని ఆరోపించారు. ప్రభుత్వానికి న్యాయస్థానంలో ప్రతిబంధకం ఎదురవుతుందని తెలిసి కూడా గ్రామ పంచాయతీల్లో బీసీల జనాభా విషయంలో నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ప్రభుత్వం వ్యవహరించలేదని పేర్కొన్నారు. బీజేపీ తొలి నుండి బీసీ గణన విషయంలో ఎన్నో సూచనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ముందు బీసీ జనాభా లెక్కలు సేకరించి, వేగంగా ఎన్నికలు నిర్వహించాలని తాము డిమాండ్ చేశామని చెప్పారు. గ్రామకార్యదర్శులు గ్రేడ్ -1 నుండి గ్రేడ్-4 వరకూ 12751 పంచాయితీలకు 3494 మంది మాత్రమే ప్రస్తుతం విధినిర్వహణలో ఉన్నారని, మిగిలిన పంచాయతీలకు గ్రామ కార్యదర్శులు లేరని అన్నారు. సీఎం మాత్రం ఒక్కరోజు కూడా సచివాలయానికి రావడం లేదని, కానీ గ్రామ పంచాయతీల కార్యదర్శులు మాత్రం ఒకొక్కరూ నాలుగు పంచాయతీలను ప్రతి రోజు సందర్శించాల్సిన దౌర్భాగ్యం ఉందని అన్నారు.