తూర్పుగోదావరి

అంధకారంలో ప్రాణాధార కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, జూలై 16: ఉభయ గోదావరి జిల్లాలకు ప్రాణాధార కేంద్రంగా విలసిల్లుతున్న కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రతీరోజు విద్యుత్ సమస్య కారణంగా అక్కడ చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం కావడంతో నగరంలో పలుమార్లు విద్యుత్ సరఫరా సరఫరా నిలిచిపోతోంది. ఈ కారణంగా ప్రభుత్వాసుపత్రికి సైతం విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోతున్న సమయంలో తక్షణం స్పందించి జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా చేయాల్సి ఉన్న ఆసుపత్రికి చెందిన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చికిత్స పొందుతున్న రోగులు ఆరోపించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లో హైఓల్టేజ్, లోఓల్టేజ్ సమస్య కారణంగా లైట్లు తరచు రిపేర్లకు గురవుతున్నట్లు కొందరు ఉద్యోగులు తెలిపారు. ఐసియు, అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రోగులు విద్యుత్ సరఫరాలో ఏర్పడుతున్న సమస్య కారణంగా వారు మరింత అనారోగ్య సమస్యలకు గురికావలసి వస్తోందని రోగుల బంధువులు ఆవేదన వెలిబుచ్చారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ప్రభుత్వాసుపత్రిలో చాలా విభాగాలకు విద్యుత్ సరఫరా అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ సమస్య రోజూ ఉంటోందని, ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు కృషిచేయాలన్నారు. ఆసుపత్రి అత్యవసర విభాగం పక్కనే ఉండే అవుట్‌పోస్టు పోలీస్ విభాగానికి సక్రమంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రమాదాలకు గురైన బాధితుల సమాచారాన్ని ఎంఎల్‌సి రికార్డుల్లో రాయలేకపోతున్నామని అవుట్‌పోస్టు పోలీసులు వాపోతున్నారు. ఈ కారణంగా బాధితుల సమాచారాన్ని సంబంధించి పోలీస్ స్టేషన్ అధికారులకు సకాలంలో అందజేయడంలో జాప్యం జరుగుతోందని, పోలీస్ అవుట్‌పోస్టు కార్యాలయంలో విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఆసుపత్రికి చెందిన విద్యుత్ విభాగం అధికారులకు విన్నవించుకున్నా వారు స్పందించడం లేదని పోలీస్ సిబ్బంది పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో జరుగుతున్న ఇబ్బందులు కారణంగా రోగులు ఇబ్బందులకు గురికావలసి వస్తోంది. ఆసుపత్రి అధికారులు తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించి రోగులు ఇక్కట్లను తీర్చాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

బంధువుల రోదనల మధ్య నాగమణి అంత్యక్రియలు
ఐ పోలవరం, జూలై 16: ఐ పోలవరం మండలం పశువుల్లంక గోదావరి నదిలో నాటు పడవ ఘటనలో మృతిచెందిన గెళ్లా నాగమణి అంత్యక్రియలు సోమవారం కమిని పంచాయతీ పశువుల్లంక గ్రామంలో నిర్వహించారు. ఆదివారం రాత్రి ఆమె మృతదేహం ఐ పోలవరం మండలం కొమరగిరి పుష్కరాల నది వద్ద లభ్యం కావడంతో యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతదేహాన్ని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, మాజీ ఎంపీ ఏజేవీ బుచ్చిమహేశ్వరరావు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పడవ మునిగిన సమీపంలో నది ఒడ్డునే నాగమణి మృతదేహాన్ని ఖననం చేశారు. భర్త దుర్గారావు, తల్లిదండ్రులు పోలిశెట్టి నాగేశ్వరరావు, సావిత్రి, కుటుంబ సభ్యులు భోరున విలపించారు.