హైదరాబాద్

గళం విప్పిన కమల దళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను నిరసిస్తూ బీజేపీ నేతలు ప్రగతి భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కలిసేందుకు చేసిన ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ కార్యాలయానికి వస్తున్న జి కిషన్‌రెడ్డిని బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి, కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్‌ను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ల వద్ద అరెస్టు చేసి తిరుమలగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని అసెంబ్లీ వద్ద అరెస్టు చేశారు. శాంతియుత నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలని చూడటం అప్రజాస్వామికమని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. భాజపా ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతి ప్రతం ఇచ్చేందుకు వెళ్తే ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అరెస్టు చేయడం ఏమిటని డాక్టర్ కే లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతిభవన్‌కు వెళ్లేందుకు తార్నాకలో బయలుదేరిన ఎన్ రామచందర్‌రావును ఆయన ఇంటివద్దనే పోలీసులు అడ్డుకుని ఆయనను హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే బద్దంబాల్‌రెడ్డిని అసెంబ్లీ వద్ద అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించగా, ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజేశ్వరరావును అరెస్టు చేసి గాంధీనగర్‌కు, వన్నాల శ్రీరాములను అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక తీరును ఖండిస్తున్నామని పార్టీ ప్రధానకార్యదర్శులు చింతా సాంబమూర్తి, డాక్టర్ జీ మనోహర్‌రెడ్డిలు ఆరోపించారు. అక్రమ అరెస్టులకు నిరసనగా బుధవారం నాడు రాష్టవ్య్రాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు వారు చెప్పారు. ముఖ్యమంత్రిని అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వలేదని, శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానందను నగర బషిష్కరణను వ్యతిరేకిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఎత్తివేయాలని కోరడానికి ముఖ్యమంత్రి వద్దకు వెళ్తున్న నేతలను అక్రమంగా అరెస్టు చేశారని వారు చెప్పారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యపాలన అంటూ వారు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఈ నియంతృత్వ ప్రభుత్వం పోయే రోజులు దగ్గరపడ్డాయని, ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రజలను , ప్రజాప్రతినిధులను కలిసే పరిస్థితి లేకపోవడం విచారకరమని డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. తిరుమలగిరి పోలీసు స్టేషన్ వద్ద ఆయన ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను వినిపించే పరిస్థితి లేదని, ఎక్కడికక్కడ పోలీసులతో బీజేపీ నేతలను అరెస్టు చేయించారని విమర్శించారు. ప్రజలు తమ సమస్యలపై ఎలుగెత్తేందుకు హైదరాబాద్‌లో ధర్నా చౌక్ ఎత్తివేశారని, ప్రజలు తమ గోడును వినిపించుకునే పరిస్థితి లేదని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్ కుమార్, అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్, మీడియా కమిటీ కన్వీనర్ వీ సుధాకర్ శర్మ పాల్గొన్నారు.