జాతీయ వార్తలు

పార్టీ ఫిరాయించినా ఆహ్వానిస్తారా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీ బుట్టా రేణుకను ఆహ్యానించడంపై ఎంపీ విజయసాయి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ ఆవరణలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్‌సీపీ తరపున ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం విజయసాయి రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన బుట్టా రేణుకను వైఎస్సార్‌సీపీ డిప్యూటీ లీడర్‌గా అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడంపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్‌ను నిలదీసినట్టు చెప్పారు. ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చినా ఇప్పటికీ తెలుగుదేశం-బీజేపీ లాలూచీ, కుమ్మక్కు రాజకీయాలు కొనసాగుతున్నాయనడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలనిఆయన అన్నారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన బుట్టా రేణుకపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు పలు దఫాలుగా ఫిర్యాదు చేశామని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. అఖిలపక్షం సమావేశంలో బుట్టారేణుక నేమ్ ప్లేట్ తొలిగిస్తారా లేక సమావేశాన్ని బాయ్‌కాట్ చేయమంటారా అని తాను నిలదీసినట్టు చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో బుట్టా నేమ్ ప్లేట్‌ను తొలగించినట్టు విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు అమలు చేయాలని ప్రధాని సమక్షంలో కోరినట్టు చెప్పారు. ఈ సమావేశంలో తాము లేవనెత్తిన విభజన హామీలపై ప్రధాని స్పందించలేదని, నాలుగు అంశాలను తమ పార్టీ తరపున అఖిలపక్ష సమావేశం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్‌కు తెలుగు రాదు.. ఇంగ్లీష్ అంతకంటే రాదు.. నాటుసారా అమ్ముకునే వ్యక్తిని ఎంపీని చేసిన ఘనత ఆ పార్టీకే దక్కుతుందని దెప్పిపొడిచారు. రాష్ట్ర, ప్రజల ప్రయోజనాలను తెలుగదేశం ఎంపీలు గాలికొదిలేశారని, హోదా సాధించాలన్న తపన టీడీపీకి లేదని మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని ఆంధ్రాకు అన్యాయం చేసింది తెలుగుదేశం పార్టీయేనని విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదాకోసం నాలుగేళ్లుగా తమ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్ రెడ్డి పోరాడుతున్నారని విజయసాయి వెల్లడించారు.