బసవతారకం ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు క్రిష్, ఎన్టీఆర్ జీవిత కథను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 5నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలయింది. కాగా ఇటీవలే విద్యాబాలన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ బయోపిక్‌లో తాను చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. ఐతే ఆమె నిన్న ‘ఎన్టీఆర్’ సెట్లోకి అడుగుపెట్టారు. బసవతారకంగారి గురించి మొత్తం తెలుసుకొని విద్యాబాలన్ ఈ పాత్రను పోషిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ చిత్రాలని కూడా ఆమె చూశారట. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌గారు బసవతారకంగారి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పే దృశ్యాలను ఈ మొదటి షెడ్యూల్‌లో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.