శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నగరంలో బీజేపీ, వీహెచ్‌పీ రాస్తాకోరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, జూలై 19: పరిపూర్ణానంద స్వామిపై నగర బహిష్కరణ చేసిన నేపథ్యంలో గురువారం బీజేపీ నాయకులు, వీహెచ్‌పీ కార్యకర్తలు నగరంలో తలపెట్టిన రాస్తారోకోను పోలీసులు అడ్డుకుని నాయకులను స్టేషన్‌కు తరలించారు. నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన నాయకులను అరెస్ట్ చేయడం దారుణమని పోలీస్‌స్టేషన్ ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మిడతల రమేష్ మాట్లాడుతూ బీజేపీ, వీహెచ్‌పీ పిలుపు మేరకు రాస్తారోకో చేసేందుకు వచ్చిన తమను పోలీసులు బైండోవర్ చేయడం హేయమైన చర్య అన్నారు. శ్రీరాముడు, సీతమ్మతల్లి, వేంకటేశ్వరస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌ను వదిలేసి, స్వామి పరిపూర్ణానందపై నగర బహిష్కరణ చేయడం మంచిది కాదన్నారు. స్వామి పరిపూర్ణానందపై వేసిన నగర బహిష్కరణను ఎత్తివేయకుంటా తామే స్వయంగా ఆయనను హైదరాబాద్ నగరానికి తీసుకొస్తామని హెచ్చరించారు. వీహెచ్‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మారం విజయలక్ష్మి మాట్లాడుతూ స్వామిపై ఆంక్షలు ఎత్తివేయకుంటా తామే స్వామీజీని హైదరాబాద్‌కు తీసుకువస్తామని, ఆపై ఎదుర్కొనే పరిణామాలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. నిరసన చేస్తున్న తమను అక్రమంగా అరెస్ట్‌లు చేయించి హిందువుల మనోభావాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాకరపర్తి జగన్‌మోహన్‌రావు, మాధవ్, వేణు, ఏవీ రత్నం, వీహెచ్‌పీ నేతలు మెంటా రామ్మోహన్‌రావు, మిద్దె శ్రీనివాసరావులతోపాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.