వారం వారం గోచారం

వారం వారం గోచారం (22-7-2018 నుంచి 28-7-2018 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆది సోమ మంగళ వారాల్లో అన్ని పనుల్లో జాగ్రత్త వహించాలి. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. ఊహించని సంఘటనలు. కార్యనిర్వహణలో జాగ్రత్త. భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. ఆధ్యాత్మిక జీవనంపై దృష్టి. అసంతృప్తి అధికం. ఆహార విహారాలపై దృష్టి. శ్రమతో కార్యక్రమాలు. కొత్త నిర్ణయాలు వాయిదా వేసుకోవాలి. దాన ధర్మాదుల వల్ల మేలు. వ్యాపార వ్యవహారాల్లో ఒత్తిడులు. బుధ గురువారాల్లో లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ప్రయాణాదులకు అవకాశం. ఆధ్యాత్మిక వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. విజ్ఞాన, పరిశోధన, ఉన్నత విద్యా రంగాలలోని వారికి చక్కని గుర్తింపు. వృత్తిపరమైన అసంతృప్తి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆది సోమ మంగళ వారాల్లో భాగస్వామ్య వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. కొత్త పరిచయాలుంటాయి. పెద్దలతో వ్యతిరేకతలకు అవకాశం. అసంతృప్తి. అనుకోని ఇబ్బందులు. కొన్ని సంప్రదింపులకు అవకాశం. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. బుధ గురువారాల్లో అన్ని పనుల్లో జాగ్రత్త. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. కొత్త పనుల వాయిదా మంచిది. నిర్ణయాదుల్లో జాగ్రత్త వహించాలి. కొన్ని ఊహించని సంఘటనలుంటాయి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో దూర ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆహార విహారాలపై దృష్టి. ఆశించిన సంతోషం అందకపోవచ్చు. శుక్ర శనివారాల్లో లక్ష్యాలపై దృష్టి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆది సోమ మంగళ వారాల్లో పోటీలు ఒత్తిడులు చికాకులుంటాయి. శ్రమ తప్పకపోవచ్చు. వ్యతిరేకతల వల్ల కాలం ధనం శ్రమ వ్యర్థం అవుతాయి. శత్రు భావనలు పెరగవచ్చు. రుణాల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. సంతానవర్గ అనుకూలత. భాగస్వామ్యాలు, పరిచయాల్లో ఒత్తిడులు. కుటుంబ, ఆర్థికాంశాల్లో కొంత అనుకూలత. బుధ గురువారాల్లో అనుబంధాలు విస్తరిస్తాయి. పరిచయాలు ప్రభావితం చేస్తాయి. భాగస్వామ్యాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. స్నేహితులతో కాలం గడిచిపోయే అవకాశం. కొంత నైరాశ్య భావన. స్ర్తిజన సహకారం, సంప్రదింపులు, శుక్ర శనివారాల్లో అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆది సోమ మంగళ వారాల్లో ఆలోచనలకు రూపకల్పన. సంతాన వర్గ వ్యవహారాల్లో పురోగతి. మనోభీష్టాలు నెరవేరుతాయి. కొత్త భావనలు. విద్యాత్మక వ్యవహారాలపై దృష్టి. సౌకర్యాదుల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. శ్రమతో గుర్తింపు. వ్యతిరేక ప్రభావాలున్నా అధిగమించాలి. నిర్ణయాదుల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. బుధ గురువారాల్లో పోటీ రంగంలో గుర్తింపు. వ్యతిరేకతలపై విజయం. సమస్యలున్నా అధిగమిస్తారు. శత్రువులు, రుణాలు, రోగాలు ప్రభావితం చేస్తాయి. భాగస్వామ్యాల వల్ల కొంత ఒత్తిడి, చికాకులు, కుటుంబ ఆర్థికాంశాల వల్ల సంతృప్తి లభిస్తుంది. శుక్ర శనివారాల్లో పరిచయాలు ప్రభావితం చేస్తాయి. స్నేహానుబంధాల్లో అప్రమత్తంగా మెలగాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆది సోమ మంగళ వారాల్లో సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. గృహ వాహనాది వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. సంప్రదింపుల వల్ల మాతృవర్గ వ్యవహారాల్లో ముందడుగు. సంతానవర్గ వ్యవహారాల్లో ఆలస్య నిర్ణయాలుంటాయి. ప్లానింగ్ అనుకూలించదు. వ్యాపారంలో పెట్టుబడులు, విహార యాత్రలపై దృష్టి. బుధ గురు వారాల్లో ఆలోచనలకు రూపకల్పన. కొత్త పనులపై దృష్టి. అభీష్టసిద్ధి. సంతానవర్గ అసంతృప్తి. విద్యారంగంలో ముందడుగు. కొన్ని వ్యతిరేకతలు తప్పకపోవచ్చు. గుర్తింపు లోపిస్తుంది. గురువారం ఆనందంగా గడుపుతారు. విహార యాత్రలుంటాయి. శుక్ర శనివారాల్లో పోటీలు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆది సోమ మంగళవారాల్లో సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాదులకు అవకాశం. సోదర వర్గం ప్రభావితం చేస్తుంది. కుటుంబంలో, ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. సౌకర్యాదుల్లో లోపాలకు అవకాశం. విద్యారంగంలో ఒత్తిడులు. వ్యాపారాదుల్లో లాభాలకు అవకాశం. సమాచారం వల్ల సమస్యలుంటాయి. బుధ గురువారాల్లో సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. సంతానంతో కలిసి సంతోషంగా గడిపే ప్రయత్నం. గృహ వాహనాది వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. కొన్ని అవాంతరాలుంటాయి. నిరాశ తగ్గించుకోవాలి. ప్రయాణాదులకు అవకాశం.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆది సోమ మంగళవారాల్లో కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. మాట తీరులో కొంత జాగ్రత్త అవసరం. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. శ్రమరహిత ఆదాయంపై దృష్టి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. గౌరవంగా మెలగుతారు. సేవకవర్గంతో సంప్రదింపులు, చర్చలుంటాయి. వ్యాపార వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. బుధ గురువారాల్లో ఇతరుల సహకారం కోసం ప్రయత్నం. కమ్యూనికేషన్స్‌లో కొంత జాగ్రత్త. ఒక సమాచారం ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార విహారాల్లో ఇబ్బందులకు అవకాశం. ప్రయాణాల్లో ఒత్తిడులు. కొన్ని లాభాలు సంతృప్తినిస్తాయి. పెద్దల ఆశీస్సులు. సోదర వర్గంతో జాగ్రత్త. శుక్ర శనివారాల్లో సౌకర్యాలు శ్రమకు గురి చేయవచ్చు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆది సోమ మంగళ వారాల్లో నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. ఉత్సాహంగా కార్యక్రమాల నిర్వహణ. అనేక బాధ్యతలు. తీరిక లేకుండా ఉంటారు. అన్ని పనుల్లోనూ అనుకూలత. వ్యవహార విజయం. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. దానధర్మాల వల్ల మేలు. ఆధ్యాత్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. సుదూర ప్రయాణ ప్రణాళికలు. బుధ గురువారాల్లో మాటల్లో కొంత జాగ్రత్త వహించాలి. నిల్వధనం కోసం ప్రయత్నం. పనుల్లో కొంత ఆలస్యం జరుగవచ్చు. ఆశించిన ఫలితాలు అందకపోవచ్చు. సంప్రదింపుల్లో లోపం వల్ల ఆర్థిక సమస్యలు. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆది సోమ మంగళ వారాల్లో ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. దూర ప్రయాణాలకు ప్లానింగ్ ఉంటుంది. పరామర్శలకు అవకాశం. విశ్రాంతిని కోరుకుంటారు. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. లాభాల వల్ల మనస్సు విశ్రాంతిగా ఉంటుంది. పనుల్లో ఆలస్యం. బద్ధకంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో మాత్రం ఇబ్బందులకు అవకాశం. జాగ్రత్త. బుధ గురువారాల్లో నిర్ణయాదుల్లో అనుకూలత. ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంతో వ్యవహరిస్తారు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. మాటల్లో కొంత నైరాశ్యం. బాధ్యతలలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం. విహార యాత్రలపై దృష్టి. ఉన్నత విద్యా వ్యవహారాలుంటాయి. శుక్ర శనివారాల్లో ఆర్థిక నిల్వలపై దృష్టి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆది సోమ మంగళ వారాల్లో లాభాలు ప్రభావితం చేస్తాయి. కొత్త పనులపై దృష్టి. పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నం. ఆశించిన ప్రయోజనాలు అందకున్నా శ్రమతో సాధిస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. గుర్తింపు. సామాజిక గౌరవం పెరుగుతుంది. ఆసుపత్రులు, పరామర్శలకు కూడా అవకాశం. వ్యాపార భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. శ్రమాధిక్యం. బుధ గురువారాల్లో వ్యర్థమైన ఖర్చులకు అవకాశం. ప్రయాణాదుల్లో జాగ్రత్త. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. నిర్ణయ లోపాలకు అవకాశం. అనుకోని సమస్యలకు అవకాశం. అనుబంధాల్లో జాగ్రత్తగా మెలగాలి. శుక్ర శనివారాల్లో నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆది సోమ మంగళవారాల్లో వృత్తి ఉద్యోగ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. బాధ్యతలు అధికం. కార్యక్రమాల ఒత్తిడులుంటాయి. సామాజిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గుర్తింపు, గౌరవాదుల కోసం ప్రయత్నం. లక్ష్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణాదులుంటాయి. నిర్ణయాదులు లాభించినా ఆలస్య ఫలితాలుంటాయి. వ్యాపార వ్యవహారాల్లో కొంత పోటీ తత్త్వం ఉంటుంది. బుధ గురువారాల్లో లాభాలు ప్రభావితం చేస్తాయి. పెద్దల ఆశీస్సులు అధికం. ఆధ్యాత్మిక వాతావరణం పెంచుకోవడం వల్ల మేలు. శ్రమ రహిత ఆదాయంపై దృష్టి పెట్టవద్దు. ఆసుపత్రులు, పరామర్శలకు అవకాశం. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆది సోమ మంగళ వారాల్లో ఉన్నత విద్య, పరిశోధనా వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు లాభిస్తాయి. లక్ష్యాలను సాధించే ప్రణాళికలుంటాయి. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి. గౌరవ లోపాలు రాకుండా జాగ్రత్త వహించాలి. నిర్ణయ లోపాలు. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమతో ఫలితాలు. ఆలోచనలకు రూపకల్పన. వ్యాపార ధోరణి విస్తరిస్తుంది. బుధ గురువారాల్లో అధికారిక వ్యవహారాలపై దృష్టి. ఉద్యోగ, వ్యాపారాంశాలు ప్రభావితం చేస్తాయి. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. లాభాలు కొన్ని ఉన్నా సంతృప్తి ఉండకపోవచ్చు. వ్యతిరేక ప్రభావాలు అత్యధికం. శుక్ర శనివారాల్లో లాభాలపై దృష్టి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ