Others

నానిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహనానికి
వనవాసమైనా ముద్దు
క్రౌర్యానికి
కురుక్షేత్రమే సరిహద్దు
వృత్తితో
వచ్చిన కులాలు
ఫిరంగులు పేల్చినా
పెచ్చులూడని అడ్డుగోడలు

సామాన్యుని చేరని
సంస్కరణలు స్వార్థం
చుక్క నీరివ్వని
మేఘాలు వ్యర్థం
ఒక్క క్షణం విచక్షణతో
దేశం భద్రం
లేదంటే ఓటరుదే
దేశద్రోహం
వెట్టిచాకిరిలో
బాల్యమంతా మాయం
రాత నేర్వని చేతులు
రాయవడం ఖాయం

ఇవి చదువులా?
చట్టుబండలు
గురు పరిమళమెరుగని
ప్లాస్టిక్ దండలు
అద్దం
నా ఆత్మబంధువు
నేనెప్పుడు ఏడ్చినా
వాడు నవ్వడు

వర్షమంటే
చాలా ఇష్టం
నా కన్నీటిని
కౌగిలించుకునే నేస్తం
- మాయకుంట్ల నారాయణరెడ్డి
9989686603
*