క్విజ్

మువ్వనె్నల జెండా రూపశిల్పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. దేశపు జాతీయ జెండా స్వేచ్ఛకు చిహ్నం. పింగళి వెంకయ్య రూపొందించిన భారతీయ జాతీయ పతాకం ఎప్పుడు స్వీకరించబడింది?
ఎ) ఆగస్టు 2, 1947 బి) జులై 22, 1947
సి) ఆగస్టు 6, 1947 డి) ఆగస్టు 10, 1947
2. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని ఆగస్టు 15, 1947 నుంచి జనవరి 26, 1950 మధ్య ఎలా వ్యవహరింపబడింది?
ఎ) భారత రిపబ్లిక్ జాతీయ పతాకం
బి) భారత దేశ డొమినియన్ జాతీయ పతాకం
సి) భారతదేశ మువ్వనె్నల ఝండా
డి) పైవన్నీ
3. పింగళి వెంకయ్య జపనీస్, ఉర్దూ, సంస్కృత భాషల్లో దిట్ట. ఆయన ఏ పేరుతో పిలవబడేవారు?
ఎ) జపాన్ వెంకయ్య బి) డైమండ్ వెంకయ్య
సి) కాటన్ వెంకయ్య డి) పైవన్నీ
4. పింగళి వెంకయ్య ఆగస్టు 2, 1876లో జన్మించారు. పింగళి వెంకయ్య చిరకాలం ఏ పేరుతో చిరస్మణీయులు?
ఎ) ఝండా వెంకయ్య
బి) ఫ్లాగ్ మాన్ ఆఫ్ ఇండియా
సి) మువ్వనె్నల ఝండా రూపకర్త డి) పైవన్నీ
5. పింగళి వెంకయ్య ఏ వృత్తిలో ఉండేవారు?
ఎ) మచిలీపట్నంలోని ఆంధ్ర నేషనల్ కాలేజీలో లెక్చరర్
బి) బెంగుళూరులో రైల్వేగార్డ్
సి) మద్రాసులో ప్లేగు వ్యాధి నిర్మూలన సంస్థ ఇన్స్‌పెక్టర్
డి) పైవన్నీ
6. పింగళి, చల్లపల్లిలో అత్యుత్తమమైన పత్తిని సాగుచేసేరు. 1909లో వ్యవసాయ ప్రదర్శన సందర్భంగా బ్రిటీష్ అధికారులు పింగళివారు పండించిన ప్రత్తి చూసి దేనికి గౌరవ సభ్యత్వం ఇచ్చి పురస్కరించారు?
ఎ) ది రోయల్ అగ్రికల్చర్ సొసైటీ ఆఫ్ లండన్
బి) ది రోయల్ బయోలాజికల్ సైనె్సస్ సొసైటీ
సి) కెమిస్ట్రీ రాయల్ సొసైటీ
డి) ది రోయల్ హార్టికల్చరల్ సొసైటీ
7. ఏ ప్రత్తి విత్తనాలు కలపడం ద్వారా పింగళి ఒక దేశీయ హైబ్రిడ్ రకం అభివృద్ధి చేసేరు?
ఎ) బురండ 1 విత్తనాల మరియు రాజన్ 1 విత్తనాలు
బి) ఎంఆర్‌సి 270 విత్తనాలు మరియు ఎంఆర్‌సి 5156 విత్తనాలు
సి) చందన్ విత్తనాలు మరియు కుందన్ విత్తనాలు
డి) కంబోడియన్ విత్తనాలు మరియు భారతీయ విత్తనాలు
8. 2009లో భారతీయ స్వాతంత్య్ర పోరాటంలో పింగళి చేసిన కృషికి భారత ప్రభుత్వం పింగళి వెంకయ్యను ఏది విడుదల చేసి గౌరవించింది?
ఎ) తపాలా బిళ్ళ బి) రూపాయ నాణేం
సి) పోస్ట్ కార్డు డి) పైవన్నీ
9. పింగళి వెంకయ్య గురించి క్రింది వానిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది?
ఎ) అతను గాంధేయవాది మరియు గొప్ప దేశభక్తుడు
బి) అతను భాషావేత్త మరియు పత్తి రైతు
సి) అతను రత్నశాస్త్ర నిపుణుడు మరియు రచయిత
డి) పైవన్నీ
10. పింగళి వెంకయ్య జూలై 4, 1963న మరణించారు. ఏ ఆల్ ఇండియా రేడియో భవనానికి పింగళి వెంకయ్య పేరు పెట్టారు?
ఎ) ఆకాశవాణి కేంద్రం, ఏలూరు
బి) ఆకాశవాణి కేంద్రం, విజయవాడ
సి) ఆకాశవాణి కేంద్రం, మచిలీపట్నం
డి) ఆకాశవాణి కేంద్రం, నెల్లూరు
*
గత వారం క్విజ్ సమాధానాలు
1డి 2సి 3ఎ 4డి 5బి 6ఎ 7సి 8డి 9ఎ 10సి

-సునీల్ ధవళ 97417 47700