శిప్ర వాక్యం

వినాశకాలే.. నేతల విపరీత బుద్ధి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావును అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించింది. ‘ఈ నటుడిని జనం రాళ్లతో కొడతారు’ అని ఓ కాంగ్రెస్ మహిళానేత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించకముందు ఎన్టీఆర్ రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తే కాంగ్రెస్ వారు తిరస్కరించారు. అప్పటి పరిస్థితుల్లో ‘తెలుగుదేశం’ పేరిట తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్‌టిఆర్ ప్రజానాయకుడైనాడు. ప్రభంజనం సృష్టించాడు. తమిళ నటుడు, మాజీ సీఎం ఎంజీఆర్‌కు ‘్భరతరత్న’ పురస్కారం ఇవ్వగా ఎన్‌టిఆర్‌కు ఎందుకు ఇవ్వలేదు? సచిన్ తెండూల్కర్, లతా మంగేష్కర్ వంటి వారికి ‘్భరతరత్న’ ప్రకటించగా- తెలుగువారైన అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం, ఎన్.టి.రామరావులు ఆ అవార్డుకు అర్హులు కారా?
కాంగ్రెస్ వ్యతిరేకత అనే పునాదులపై ‘తెలుగుదేశం’ ఆవిర్భవించగా, ఇప్పుడు ఆ పార్టీలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. 2019 ఎన్నికల్లో ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ అస్తిత్వం కోసం కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకు సిద్ధపడుతున్నారనే వార్తలు విస్మయం కలిగిస్తున్నాయి. నిన్నటి వరకూ ‘తల్లి కాంగ్రెస్- పిల్ల కాంగ్రెస్’ అంటూ సోనియా గాంధీ పార్టీని, వైకాపా జగన్‌ను తిట్టిన చంద్రబాబు ఇప్పుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎందుకిలా తాకట్టుపెట్టేందుకు యోచిస్తున్నారో ఏపీ ప్రజలకు తెలియాల్సి ఉంది. ప్రధాని మోదీని విభేదించి, ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు ఇప్పుడు- ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అనే నినాదాన్ని అందుకున్నారు. ఆయన కేంద్రంపై ‘్ధర్మపోరాటాలు’ చేస్తూ రాష్ట్రంలో పరిపాలనను గాలికొదిలేశారన్న ఆరోపణలు జోరందుకున్నాయి. చంద్రబాబు చేస్తున్న ఉద్యమం ఎన్నికల్లో జనం వోట్ల కోసమేనా? సిద్ధాంతాలను వదిలేసి వోట్ల కోసం ఆగర్భ శత్రువులను అక్కున చేర్చుకోవడం చూస్తే ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్న మాటలు గుర్తుకురాక తప్పదు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకొని పోయినా చంద్రబాబు దానికి ప్రాణప్రతిష్ఠ చేయాలని ప్రయత్నించటం ఆత్మహత్యా సదృశం. దీనివల్ల ఎన్‌టిఆర్ ఆత్మ క్షోభిస్తుంది. రాజకీయ కోణంలో నేతలు వ్యక్తిగత విషయాలపైనా విమర్శలు చేయడం ఇపుడు పరిపాటైంది. ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి వైకాపా అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఈ కోవకు చెందినవే. ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం జగన్‌కు రాజకీయంగా మంచిది కాదు. ముఖ్యమంత్రి కావాలని ఆరాట పడుతున్న జగన్ ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం రాజకీయ పరిణతి కాదు. నేతలు చేసే ఆరోపణలు వారి రాజకీయ ప్రస్థానాన్ని నిర్దేశిస్తాయి.
***
ప్రత్యేక హక్కులు, రాయితీలు, రిజర్వేషన్ల కోసం అనేక రాష్ట్రాల్లోనూ ఉద్యమాలు రాజుకుంటున్నాయి. మహారాష్టల్రో మరాఠాలు రిజర్వేషన్ల కోసం పోరుబాట పట్టారు. మరాఠాలంటే ఎవరు? శరద్ పవార్, సుప్రియా సూలే, ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే.. వీరంతా వెనుకబడిన వారా? వీళ్లకు రిజర్వేషన్లు ఎందుకు? జాట్ కులస్థులకు రిజర్వేషన్ల పేరిట హర్యానాలో అరాచకాలు చేశారు. ఆస్తులకు నిప్పుపెట్టారు. ఢిల్లీకి వెళ్లే నీటిపైపులను పగలగొట్టారు. ఇంత విధ్వంసం దేనికి? కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ఇలాంటి ఉద్యమాలకు ఆజ్యం పోస్తున్నాయి.
***
‘ఎంతకైనా తెగించండి.. నరేంద్ర మోదీని ఓడించండి’ అని సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఎందుకంటే ఆమె అనేక అక్రమాస్తుల కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నది. ఆ కేసుల నుంచి తప్పించుకోవాలనే ఈ ప్రయత్నం. ఇక, తెలంగాణలో అర్బన్, రూరల్, జంగిల్ తీవ్రవాదులను సమన్వయం చేస్తూ ఓ కొత్తపార్టీ సమస్యలు సృష్టించేందుకు యత్నిస్తోంది. వీరికి కావలసినంత ఆర్థిక సహాయం కాంగ్రెస్ పార్టీ నుండి అందుతున్నదట! సీమాంధ్రలో తాము గనుక అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇవ్వడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాగ్దానం చేస్తోంది. చెంపమీద కొట్టి ‘సారీ’ చెప్పటం అంటే ఇదే. అశాస్ర్తియంగా, హడావుడిగా రాష్ట్ర విభజన చేసింది సోనియా గాంధీ. తిరిగి అధికారం సంపాదించుకోడానికి వాగ్దానాలు చేస్తున్నది కూడా ఆమె అనుయాయులే.
కేరళలో ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ (పీఎఫ్‌ఐ) అనే ఉగ్రవాద సంస్థ ఉంది. ఇది సిరియాలోని ‘ఐసిస్’కు తోబుట్టువు. రాజకీయ లబ్ధి కోసం దశాబ్దాలుగా కేరళలో వామపక్ష పార్టీలు ముస్లిం లీగ్, పిఎఫ్‌ఐలను పెంచి పోషించాయి. పాముకు పాలుపోస్తే అది కరవకుండా ఉంటుందా? ఇప్పుడు సీపీఎం క్రియాశీల కార్యకర్తలను పిఎఫ్‌ఐ మద్దతుదారులు హత్యచేస్తున్నారు. ‘మతం మత్తుమందు’ అనేది కమ్యూనిస్టుల మూల సూత్రం. కేరళలో ఓనం, దసరా వంటి హిందూ ఉత్సవాలపై వామపక్ష ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో హిందువులు తమకు దూరమైనారని ‘లెఫ్ట్’ నేతలు గ్రహించారు. రామాయణ మహోత్సవాలు మొదలుపెట్టండని ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి జయన్ తన కార్యకర్తలను ఆదేశించారు. వినడానికి ఇది వింతగా అనిపించవచ్చు. కాని ఇదొక కఠోర సత్యం! విజయన్ నేతృత్వంలో రామాయణ ఉత్సవాలు సిపిఎం నిర్వహిస్తున్నది. మహారాష్టల్రో శివసేన పార్టీ పుట్టింది హిందువులను రక్షించడం కోసం. ఇప్పుడు భాజపాను ఓడించాలని బస్సులకు నిప్పుపెట్టి ఉద్యమాలు నడుపుతోంది. గతంలో హిందూ మహాసభ నాయకులు భారతీయ జన సంఘ్‌ను ఓడించేందుకు ఇలాగే చేశారు ఫలితంగా రెండు పార్టీలూ డిపాజిట్లు కోల్పోయాయి. ఇది ఎవరూ కాదనలేని చరిత్ర!
***
ఇక, స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్‌లోని బోడుప్పల్ నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర చేయాలనుకుంటే తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ వివాదం కాస్తా కోర్టుకు చేరింది. ప్రభుత్వాన్ని హైకోర్టు సంజాయిషీ చెప్పవలసిందిగా కోరితే ‘తప్పు మాదికాదు, అది పోలీసుల నిర్ణయం’ అంటూ సమాధానం చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం హిందువుల్లో ఆగ్రహం రగిలించింది. తెలంగాణలో భాజపాకు ఐదుగురు ఎంఎల్‌ఏలు ఉన్నారు. ఈ సంఖ్య 2019 ఎన్నికల్లో కాస్త పెరిగినా- అధికార పీఠం అందుకోవడం అంత తేలిక కాదు. భాజపాలోనూ నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. తెలంగాణ కాంగ్రెస్‌లో అయితే- వర్గ పోరాటాలకు, నాయకత్వ పోరుకు అంతే లేదు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల హైదరాబాద్ వచ్చి కార్యకర్తల పనితీరు పట్ల, బూత్ కమిటీలను బలోపేతం చేయకపోవటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ముప్పయి మంది వోటర్లను ఒక కార్యకర్త సమన్వయం చేయాలి. వీరిని పన్నాప్రముఖ్‌లు అంటారు. అది లేనప్పుడు విజయం అసాధ్యం అని అమితా షా తేల్చి చెప్పారు. దీంతో తెలంగాణ భాజపా ఆత్మరక్షణలో పడింది. బస్సుయాత్రలు తుస్సుమంటాయని తేలింది. తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. ఉత్తమకుమార్‌రెడ్డి టీ-పీసీసీ అధ్యక్షుడుగా ఉంటే 20 సీట్లు కూడా రావడం కష్టమని ఆ పార్టీ ప్రతినిధి వర్గం ఢిల్లీ వెళ్లి పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల ముందు ఇలాంటి అంతర్గత కలహాలు పార్టీ విజయావకాశాలను భారీగా దెబ్బతీస్తాయి.
***
రాంచీలో 280 మంది పసిపాపల విక్రయం జరిగింది. ఈ పని చేసింది మదర్ థెరిసా స్థాపించిన మిషనరీ సంస్థ. పిల్లలను విక్రయిస్తున్న క్రైస్తవ సన్యాసినులు పట్టుపడ్డారు. 280 మంది గూర్చి నాకు తెలియదు. నేను నలుగురిని మాత్రమే విక్రయించానని ఒక సన్యాసిని చెప్పింది. మరి గల్లంతైన 280 పేర్ల మాటేమిటి? ఐదుగురు బిషప్పులు సన్యాసినులపై అత్యాచారాలకు పాల్పడినట్టు కోర్టులో కేసులు నమోదయ్యాయి. నిందితులకు కేరళ హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. జీసస్ క్రైస్తు చెప్పిన శాంతి బోధలేమైనాయి?? సేవ పేరిట ఈ దుర్మార్గాలేమిటి? ఇలాంటి లైంగిక నేరాలతో క్రైస్తవంపై మచ్చ పడుతోంది. జిహాదీ ఉగ్రవాదంతో ఇస్లాం మతానికి చెడ్డపేరు వస్తోంది. మరోవైపు అనైక్యతతో హిందూజాతి ఇంకా నిర్వీర్యమైపోతోంది.
***
రాఫెల్ జెట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలు ఒప్పందంలో కొందరికి భారీగా ముడుపులు అందినట్టు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే నిందితులను కఠినంగా శిక్షించాల్సిందే. విమర్శలు అసత్యమైతే పార్లమెంటులో అబద్ధం చెప్పిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ మోషన్ పెట్టి దండించాలి. అదీ ఇదీ లేకుండా టీవీ చానళ్లలో ఈ ఉచిత వినోదం దేనికి?
*

ప్రొ. ముదిగొండ శివప్రసాద్