అంతర్జాతీయం

వాతావరణం మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మాండు, ఆగస్టు 9: వాతావరణ పరిస్థితులు మెరుగవ్వడంతో నేపాల్ నుంచి పలువురు భారత్ యాత్రికులు కైలాష్-మానససరోవర్ యాత్ర నిమిత్తం సిమిల్‌కోట్‌కు పది విమానాల్లో బయలుదేరారు. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా ఉండటంతో సిమిల్‌కోట్, నేపాల్ గంజ్‌ల మధ్య నిన్నటి నుంచి విమానాలు యథావిధిగా తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు. నేపాల్‌గంజ్ నుంచి పది విమానాల్లో వంద మంది వరకు భారతీయ ప్రయాణికులు సిమిల్‌కోట్, హుమ్లాకు బయలుదేరారని ఒక దౌత్య అధికారి తెలిపారు. కాగా కైలాస్-మానస సరోవర్ యాత్ర నిమిత్తం బయలుదేరి 165 మంది భారతీయులు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో గత వారం సిమిల్‌కోట్‌లో నిలిచిపోయారు. తర్వాత వాతావరణం బాగుండటంతో 110 మంది భారతీయులు సోమ, మంగళవారాల్లో తమ యాత్రను పునః ప్రారంభించారు. మిగిలిన 55 మంది నేపాల్‌గంజ్‌కు విమానాల్లో పంపించారు. చైనాలోని టిబెట్ రీజియన్‌లో ఉన్న కైలాస్ సరోవర్ ప్రాంతాన్ని పవిత్రమైనదిగా హిందువులు, బౌద్ధులు, జైన్‌లు నమ్ముతారు. ప్రతి సంవత్సరం వందలాది మంది భారతీయులు మానససరోవర్ యాత్రకు బయలుదేరుతారు. అయితే వీరి యాత్రలో భాగంగా పలుకొండలను యాత్రికులు ఎక్కాల్సి ఉంటుంది. అలాగే క్లిష్టతరమైన మార్గాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత నెలలో 1500 మంది భారతీయులు యాత్ర నుంచి వస్తూ ప్రకృతి విలయాల మధ్య చిక్కుకుపోగా, అధికారులు వారిని కాపాడారు.