అంతర్జాతీయం

ఆదిత్యా.. వస్తున్నా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: ఊహకు కూడా అందని ఓ అద్భుతాన్ని నాసా ఆవిష్కరించింది. సూర్యుడికి అత్యంత సమీపంలోకి వెళ్లి, సమాచారం సేకరించడమేగాక, ప్రయోగాలు నిర్వహించే సామర్థ్యం ఉన్న పార్కర్ సోలార్ ప్రోబ్ మిషన్‌ను విజయవతంగా ప్రయోగించింది. ఏడేళ్లపాటు సుదీర్ఘంగా ప్రయాణించి, సూర్యుడి బాహ్య వలయం కరోనాలోకి ప్రవేశించే వ్యోమనౌకను యునైటెడ్ లాంచ్ అలియన్స్ డెల్టా ఫోర్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.01 గంటలకు (్భరత కాలమానం ప్రకారం సాయంత్రం 3.31 నిమిషాలు) నింగిలోకి తీసుకెళ్లింది. అమెరికా కేప్ కానవెరల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లోని స్పేస్ లాంచింగ్ కాంప్లెక్స్ 37 నుంచి ఈ ర్యాకెట్‌ను ప్రయోగించారు. సుమారు పదేళ్ల క్రితమే పురుడుపోసుకున్న ఈ మిషన్‌కు 91 ఏళ్ల సైంటిస్టు యుగెనీ ఎన్. పార్కర్ పేరును ఖరారు చేశారు. సౌర గాలులు (సోలార్ విండ్స్) ఉంటాయని 1958లోనే పార్కర్ కనుగొన్నారు. తన పేరుతో వ్యోమనౌక సూర్యుడి వద్దకు
వెళ్లేందుకు నింగికెరిగే సమయంలో ఆయన కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించడం విశేషం. 1.5 బిలియన్ డాలర్ల ఖర్చుతో చేపట్టిన ఈ ‘టచ్ ది సన్’ మిషన్ ద్వారా మొట్టమొదటిసారి ఓ వ్యోమనౌకను సూర్యుడి వద్దకు పంపారు. దీనితో ముందుగానే నమోదు చేసుకున్న 1.1 మిలియన్ల మంది పేర్లతో కూడిన మెమరీ కార్డును, ‘భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం’ అనే నినాదం రాసి ఉన్న ఫలకాన్ని కూడా జత చేశారు.
మానవాళికి మేలు!
సూర్యుడికి అత్యంత సమీపానికి వ్యోమనౌకను పంపి, ప్రయోగాలు చేయడం వల్ల మానవాళికి ఎంతో మేలు జరుగుతుందని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో పేర్కొంది. వ్యోమనౌక సూర్యుడి బాహ్య వలయాన్ని చేరుకోవడానికి సుమారు ఏడేళ్లు పడుతుందని తెలిపింది. మొదటి వారంలో హై గెయిన్ యాంటీనా ఈ వ్యోమనౌక నుంచి విడిపోతుంది. ఆతర్వాత మరో రెండు యాంటీనాలు కూడా వేరవుతాయి. సెప్టెంబర్ మొదటి వారంలో కీలక పరికరం పరీక్షలు మొదలవుతాయి. సౌర తుపానులు, జ్వాలలు, వాటి తీవ్రత వంటి పలు అంశాలపై ‘పార్కర్’ అధ్యయనం చేస్తుంది. దీనివల్ల ప్రకృతిలో చోటు చేసుకునే కీలక మార్పులను ముందుగానే పసిగట్టవచ్చని శాస్తవ్రేత్తలు అంటున్నారు. కేవలం భూగోళానికి మాత్రమేగాక, యావత్ విశ్వానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు ఈ ప్రయోగం ద్వారా సమాధానాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. గంటకు సుమారు 7,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన వ్యోమ నౌక 3.8 మిలియన్ మైళ్ల దూరాన్ని పూర్తి చేసుకొని, సూర్యుడి బాహ్య వలయంలోకి చేరుతుంది. 1,377 డిగ్రీల సెల్సియస్ వేడిని కూడా తట్టుకునే విధంగా ‘పార్కర్’ను తయారు చేశారు. అత్యంత సాహసోపేతమైన ఈ ప్రయోగాన్ని అంతరిక్ష పరిశోధనల్లో కీలక మలుపుగా శాస్తవ్రేత్తలు అభివర్ణిస్తున్నారు.