అంతర్జాతీయం

శ్రీలంకలోని భారతీయులకు నివాస గృహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఆగస్టు 12: శ్రీలంకలో భారత మూలాలున్న ప్రజలకు యూఎస్‌డీ 350 ప్రాజెక్టు ద్వారా కొత్తగా నిర్మించిన నివాస గృహాలను భారత ప్రభుత్వం ఆదివారం అందజేసింది. అక్కడి తేయాకు, రబ్బరు తోటల్లో పనిచేస్తూ పెద్దసంఖ్యలో భారతీయులు, ప్రత్యేకించి తమిళులు నివస్తున్నారు. కాగా అక్కడి నువారాఎలియా నగర సమీపంలోని దున్సినానె ఎస్టేట్ ప్రాంతంలో ఇండియన్ హౌసింగ్ ప్రాజెక్టు కింద నిర్మించిన నివాస గృహాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ఈ కార్యక్రమం లో పాలుపంచుకున్నారు. ఇతర దేశాల్లో భారత్ చేపడుతున్న ప్రాజెక్టులన్నింటిలోకి ఇది అతిపెద్దది కావడం గమనార్హం. మొత్తం 404 నూతన గృహాలను, వాటికి సంబంధించిన స్థల యాజమాన్య హోదాను శ్రీలంక భారతీయులకు ఆదే శ ప్రధాన మంత్రి రానిల్ విక్రమసిఘే అందజేశారు. భారత హైకమిషనర్ తరన్‌జిత్ సింగ్ సం ధు, మంత్రులు పళని దిగంబరం, నవీన్ దిశర నాయకే, గాయంత కరుణ తిలకే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓవైపు వర్షం పడుతూ వాతావరణం సహకరించకున్నా దాదాపు 1500మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారని భారత హైకమిషనర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇరుగుపొరుగు సహకారం విషయంలోశ్రీలంకకు భారత్ ప్రత్యేక స్థానం ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు. శ్రీలంకలో నిర్మించ తలపెట్టిన 60 వేల గృహాలకుగాను ఇప్పటికే 47 వేల గృహ నిర్మాణం పూర్తయిందని ఈ సంద ర్భంగా మోదీ తెలిపారు.