అంతర్జాతీయం

33 రిజర్వుడ్ సీట్లు దక్కించుకున్న ఇమ్రాన్‌ఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 12: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకున్న ఏకైక పార్టీగా అవతరించిన మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ పార్టీలో మరో 33 రిజర్వుడ్ సీట్లు జమ అయ్యాయి. ఈ రిజర్వుడ్ సీట్లు దక్కించుకోవడంతో ఆ పార్టీ బలం 158కు చేరుకుంది. కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టడానికి ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఇంకా కేవలం 14 సీట్ల దూరంలో ఉంది. అయితే, సంపూర్ణ మెజారిటీ కోసం ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే పలు ఇండిపెండెంట్ల మద్దతును అభ్యర్థించారు. పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ గత నెలలో జరిగిన జాతీయ ఎన్నికల్లో పోటీ చేసిన వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లను ప్రాతిపదికగా చేసుకుని 60 రిజర్వుడ్ సీట్లు, 10 మైనారిటీ సీట్లను తాజాగా ప్రకటించింది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐకి అత్యధికంగా 33 రిజర్వుడ్ సీట్లు దక్కాయి. ఇందులో 28 మహిళలు, ఐదుగురు ముస్లిమేతర వ్యక్తులు ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి పంజాబ్ నుంచి మహిళలకు 16 రిజర్వుడు సీట్లు, పంజాబ్ నుంచి నాలుగు సీట్లు, ఖైబర్ పక్తున్‌క్వా నుంచి ఏడు, బలూచిస్తాన్ నుంచి ఒక సీటు దక్కాయి. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీకి ఐదు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి రెండు, ముతాహిదా మజ్లిస్-ఇ-అమల్ (ఎంఎంఏ) పార్టీకి ఒక సీటు దక్కాయి. దేశం తదుపరి ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ పేరు ఖరారైనప్పటికీ చిన్నపార్టీల మద్దతుతో జాతీయ అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. 342 సీట్లు ఉన్న జాతీయ అసెంబ్లీలో ఏ పార్టీ అయినా అధికార పగ్గాలు చేపట్టాలంటే 172 సీట్ల మేజిక్ ఫిగర్ ఉండాలి.