రుచి

కరకరలాడే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెంతి చెక్కలు
కావాల్సినవి
సెనగపిండి - 1 కప్పు, మైదా - అర కప్పు, మొక్కజొన్నపిండి - అర కప్పు, ఉడికించిన బంగళాదుంప ముద్ద - అరకప్పు, వేయించిన పల్లీల పొడి - పావు కప్పు, వాము - 1 టీ.స్పూ., అల్లం వెల్లుల్లి పేస్టు - 1 చెంచా, ఉప్పు, కారం - తగినంత, మెంతి ఆకులు - కప్పు, తెల్లనువ్వులు - టేబుల్ స్పూన్, నూనె - వేయించడానికి సరిపడా.
తయారీ
ఓ గినె్నలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని తీసుకుని నీళ్ళతో పూరీ పిండిలా ముద్దలా కలపాలి. ఈ పిండిని ఇరవై నిమిషాలు నాననివ్వాలి. ఆ తరువాత చెక్కల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేయాలి. బాగా వేగాక తీసేయాలి. వేడి తగ్గాక గాలి తగలని డబ్బాలోకి తీసుకుంటే ఇరవై రోజుల వరకూ తాజాగా ఉంటాయి.
*
జొన్నపిండి జంతికలు
కావాల్సినవి
జొన్నపిండి - నాలుగు కప్పులు, వెనె్న లేదా నెయ్యి - చెంచా, ఉప్పు - తగినంత, జీలకఱ్ఱ - అరచెంచా, నువ్వులు - చెంచా, పచ్చిమిర్చి పేస్టు - ఒకటిన్నర చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు - పావు చెంచా, వాము - పావు చెంచా, నూనె - వేయించడానికి సరిపడా.
తయారీ
ఓ గినె్నలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ తీసుకుని బాగా కలపాలి. ఆ తరువాత వేడినీళ్ళు పోస్తూ గట్టిగా ముద్దలా కలపాలి. ఇపుడు బాణలిలో నూనె వేడి చేసి మంట తగ్గించాలి. గోరువెచ్చని నీటితో చేయిని తడి చేసుకుని తరవాత పిండిని తీసుకుని జంతికల గొట్టంలో ఉంచి నూనెలో జంతికల్లా వేయాలి. ఎర్రగా వేగాక తీస్తే సరిపోతుంది. జొన్నపిండి జంతికలు సిద్ధం.
*
ఇలంబ్రికాయలు
కావాల్సినవి
మైదా - 3 కప్పులు, కొబ్బరిపాలు - రెండు కప్పులు, మొక్కజొన్నపిండి - చెంచా, వరిపిండి - అరకప్పు, వాము - కొద్దిగా, వెన్న - రెండు చెంచాలు, కారం - చిటికెడు, ఉప్పు - కొద్దిగా, నూనె - వేయించడానికి సరిపడా.
తయారీ
ఓ గినె్నలో పైన పేర్కొన్న పదార్థాలన్నీ తీసుకుని గట్టిగా చపాతీ పిండిలా కలపాలి. దీన్ని అరగంట నాననివ్వాలి. తరవాత కొద్దిగా పిండిని తీసుకుని పూరీలా వత్తుకుని అరసెంటిమీటరు దూరంలో చాకుతో పొడుగ్గా గాట్లులా పెట్టుకోవాలి. దీన్ని మళ్లీ రెండు చివర్లతో రోల్‌లా చుట్టుకుని నూనెలో వేయించుకోవాలి. ఇలా మిగిలిన పిండిని చేసుకుంటే సరిపోతుంది.
*
సగ్గుబియ్యం చెక్కలు
కావాల్సినవి
బియ్యం - మూడు కప్పులు, పెసరపప్పు - కప్పు, సగ్గుబియ్యం - అరకప్పు, నువ్వులు - రెండు టేబుల్ స్పూన్లు, జీలకఱ్ఱ - చెంచా, వెన్న - చెంచా, కారం, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేయించడానికి సరిపడా.
తయారీ
బియ్యం, పెసరపప్పు, సగ్గుబియ్యాన్ని కలిపి మెత్తగా పిండిలా చేసుకోవాలి. అందులో నువ్వులూ, జీలకర్రా, తగినంత ఉప్పు, కారం వెన్న వేసుకుని బాగా కలపాలి. తరవాత సరిపడా నీళ్ళు పోసుకుంటూ చపాతీ ముద్దలా కలపాలి. ఐదు నిమిషాల తరవాత ఈ పిండిని చిన్న చిన్న చెక్కల్లా అద్దుకుని వేడి నూనెలో వేయించుకోవాలి. బాగా వేగాక తీసేస్తే సరిపోతుంది.

- సిహెచ్.అనూహ్య