వీరాజీయం

సొంతగడ్డపై ఉన్నాం.. ‘మేడ్ ఇన్ చైనా’ అన్నాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా దేశం వేళ్ళానూ.. అయినా హృదయం మన దేనూ... అంటూ హాస్యనటుడు రేలంగి మీద చిత్రీకరించిన పాత సినిమా పాట ఒకటి ఉంది. కానీ, ‘ఇండియాలోనే ఉన్నానూ... అయినా వాడేవన్నీ చీనా వస్తువులేనూ...’ అని పాడుకుంటున్నాం నేడు మనం. అంతెందుకు..? మన దీపావళికి, దసరా పండుగలకి కూడా వాళ్ళ టపాసులదే సందడి.. మన దేవుళ్ల బొమ్మలు.. డాం డాం బాణసంచా పేలుళ్లు అన్నీ వాళ్లవే. అయ్యా! ఇట్లా అన్నీ చైనావేనూ.. అంతేనా? దియాలు అంటారు -అంటే దీపాలు కూడా మేడిన్ చైనావే.. మన దేవుడికి కావాల్సిన ఆకులూ పత్రీ తప్ప మన దేవుళ్ళ ఆరాధనకి పూజలకీ -చీనా దిగుమతులే శ్రేష్టం.. కారణం మనకి చౌక ధరలకి లభిస్తాయవి. చీనా నుంచి కృత్రిమ కోడిగుడ్లు , ప్లాస్టిక్ బియ్యం కూడా మన వాళ్లు చవి చూస్తున్నారు. ఏ స్మార్ట్ ఫోన్ అయినా అది చైనా మేడ్. అది మన జీవితంలో మేకు అయినా సరే -అంతే .. మేడ్ ఇన్ ఇండియా మొబైల్స్ వుంటే వాటి మీద పోర్నోగ్రఫీ (బూతు) వెబ్‌సైట్లు వస్తాయా ? భేషుగ్గా వస్తాయి గాని, వాళ్ళ దేశంలో ఇలాంటి చెత్తని ‘బాయ్‌కాట్’ చేసేసుకున్నారు గాని మన అరచేతిలోని స్మార్ట్ ఫోన్‌లనిండా అవే పుష్కలం.. మన ఫండమెంటల్ రైట్స్ అవే కదా మరి?
కొత్తగా వార్త ఏమిటంటే- మన వంద రూపాయల కాయితాలు, అయిదు వందల నోట్ల కరెన్సీ నోట్లు కూడా చైనా నుంచి దిగుమతి అవుతాయని బోలెడు పుకార్లు. ఈ వదంతులు నిజం కావని మన ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. ఇప్పటికే చీనా టాబ్లెట్స్, చీనా ట్యూబ్‌లైట్స్ అని మురిసిపోతూ. అవే వాడుకుంటూ, వాటినే ఆరాధిస్తూనే చైనా దేశాన్ని శత్రు దేశంగా మనం భావిస్తున్నాం. అదే నోటితో యథాశక్తి తిట్టుకవిత్వం చెప్పుకుంటున్నది మన పవిత్ర భారత దేశం. కేవలం చైనా వారు నేపాల్ దేశం కోసం కరెన్సీ నోట్లు మాత్రమే - 2015 నుంచి తమ సొంత మింట్‌లలో ప్రింట్ చేసి- ఇంచక్కా ప్యాక్ చేసి పంపిస్తున్నారు అనుకుంటున్నాము. చైనాలో మన కరెన్సీ నోట్లు ముద్రిస్తారనడం నిజం కాదని తెలిసినా, చైనా వస్తువులు మన మార్కెట్లను ముంచెత్తడం అన్నది మాత్రం కాదనలేని వాస్తవం. వాటిని అరికట్టడం మన ప్రభుత్వానికి సాధ్యం కాదా?
చైనాకు చెందిన అంతర్జాతీయ మీడియాని బట్టి -‘చీనావాడు బోలెడన్ని ఇతర దేశాల కరెన్సీ నోట్లు రేయింబవళళు కష్టించి ముద్రించి ఎగుమతి చేస్తున్నాడుట!. విదేశీ కరెన్సీ కట్టలను ముద్దుగా ఆయా దేశాలకు బంగీ కట్టేస్తున్నాడు -ఈ సంగతి తాజాగా, సంచలనం కలిగిస్తున్న -సరి కొత్త పాత వార్త.
అయ్యో..! మనం వాడే కొన్ని కరెన్సీ కాయితాలు ‘మేడ్ ఇన్ ఇండియా’ కావా? కేవలం లెక్చరింగులే మన ఇండియా ‘‘మేకులా?’’ అంటూ వ్యంగ్య బాణాలు విసిరేడో ఓల్డ్ సిటిజన్ క్రిటిక్కు. ఔనండీ .. ఔను... బి అండ్‌ఆర్ (బెల్ట్ అండ్ రోడ్) ఇనీషిఏటివ్ అనే ప్రాజెక్టు కింద ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాల బృందంలోని దేశాలకు వౌలిక అవసరాలతో పాటు ఆయా దేశాల కరెన్సీ నోట్లు కూడా చైనా అచ్చు గుద్దేస్తోంది. అందరికీ కాకపో యినా- మన బుల్లితెర ‘చర్చాసురుల’లో కొంతమదికైనా ఈ వదంతుల గురించి తెలుసునని అనుకుందాం కానీ- వారంతా అదర్వైజ్ బిజీ... చైనా వాడు థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా,బ్రెజిల్, పోలండ్ వగైరా దేశాలకు కరెన్సీ కట్టలు, నాణేలు కూడా తన మింట్లలో ముద్రించి సప్లయ్ చేస్తున్నాడుట!
సమాచారం ఏమనగా- ఇండియాకి కూడా చీనా దేశం మన ఘనత వహించిన ఆర్‌బీఐ కోరిక మీద కరెన్సీ నోట్లను -ఒక రెండు వేల మిల్లియన్లు మేరకు వందరూపాయల నోట్లను అలాగే, పదహారు వందల మిల్లియన్ల సంఖ్యలో ఐదువందల రూపాయల కాయితాలను చైనా మింట్లు అహ ర్నిశలూ శ్రమించి ప్రింటు చేస్తున్నాయని -‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ అనే పత్రిక వారి ప్రత్యేక కథనమ్. దీన్ని చీనా మింటు వర్గాలు కూడా బలపరుస్తున్నాయట! 2013లో ‘బెల్ట్ అండ్ రోడ్’ ఇ్పషియేటివ్ -చాలా దేశాల నోట్ల ముద్రణ కు చేయూతను ఇస్తున్న విషయం వాస్తవమే గాని, ఇండియా పేరు ఈ లిస్టులోకి ఎక్కిందన్న వదంతులు రావడంతో కలకలం రేగింది. చైనా మింటు కార్పొరేషన్ చాలా పెద్దది - దానికి చేతినిండా పని లేదన్న మాట కూడా చక్కర్లు కొడుతోంది. మొత్తం పది మిన్టింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో - పనివాళళు కుప్పలు కుప్పలు. 18 వేల - అక్షరాలా పద్దెని మిది వేల మంది సిబ్బంది జీతాలు తీసుకుంటున్నారుట. రాత్రి వేళ కూడా వాళళు పని చేస్తారుట.
అబ్బో! నేను ఇంత పెద్దా అంత పెద్దా ..అంటూ డంబాలు కొట్టే అమెరికా దేశం మింటులో కూడా కేవలం రెండువేల వర్కర్లు మాత్రమే -పని చేస్తున్నారుట. ‘ఔనండీ .. ఔను...’ అన్నాడో లెఫ్టిస్టు భావజాలంలో కొట్టుకు పోతున్న కుర్రవాడు ఒకడు. చైనా దేశానికి జనాభా ఎక్కువ. పైగా , అసలు పేపరు అనగా- కాగితం ఎవరు కనిబెట్టారు? చీనావేగా ? అని కూడా రెట్టించాడు. కరక్టే .. పైగా చైనా లోని యువతీ యువకులు ఇటీవల -మన ప్రధానమంత్రి మోదీజీ గారి మన్ కీ బాత్ వల లో పడ్డట్లున్నారు.. బొత్తిగా, కేష్- కరెన్సీ -నగదు నాణేలు మొదలైనవాటిని వాడటానికి విసుగు చెంది.. -స్మార్ట్ ఫోన్ లమీద, రూప రహిత లావా దేవీలు లాగిం చేస్తున్నారుట.. ఔరా? .. చీనా వాడు ఎంతకైనా తగును’ అన్నదో ఇల్లాలు.
అది అట్లుండ నిండు.. 2016 లో భారత్‌లో పెద్దనోట్ల రద్దు గట్టి స్ట్రోక్ కొట్టింది కదా? ఆనక, ఈ ఏడాది-ఆరాలు అంచనాలు తీసి చూస్తే, దేశవాళీ బ్యాంకులలో ఫేక్ కరెన్సీ చేరడం ఇంచుమించు ఒక ప్రవాహం లాగా అయిందిట .. అనుమానాస్పద, అవకతవక లావాదేవీలు కనీసం నాలుగు వందల పద్దెనిమిది శాతం దాకా పెరిగాయట. చైనా మింట్లకు పుర మాయించి మనం కరెన్సీ కట్టలనుతెచ్చుకుంటే - దేశంలో నకిలీ కరెన్సీ ప్రవాహంలా వచ్చేసే ప్రమాదం ఉన్నదని, -‘మనీ లాండరింగు’ కి ద్వారాలు తెరిచినట్లే అవుతుందని శశి థరూర్ లాంటి అనుభవజ్నులు కంగారు పడు తున్నారు. పాకిస్తానుకు అడ్వానే్టజీ వస్తుందని కూడా కొందరు చెబుతున్నారు. ఈ అందోళన మొత్తానికి ఏలినవారి చెవిన కూడా పడ్డట్లుగా ఉంది . ‘అటువంటిదేమీ లేదు- చైనా మీడియా ప్రచారంలో అస్సలు ఎ లాంటి వాస్తవం లేదు. మన నోట్లు మన రిజర్వు బ్యాంక్ ప్రెస్సుల్లోనే ప్రింట్ అవ్వాలి’ అంటూ- డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫయర్స్ అధికారి- ఈ వార్తలను గట్టిగానే ఖండించారు .. కానీ, నిప్పు లేనిదే పొగరాదు అంటారు కదా పెద్దలు. ఆరా తీసి దాని నిగ్గు తేల్చాలి అన్నది జనవాక్యం. కాని చైనా వర్గాలు మాత్రం ‘మేం ప్రింట్ చేశాం’ అని బుకాయిస్తున్నారు. కరెన్సీలో మాత్రం ‘మేడ్ ఇన్ ఇండియా’ తప్ప, మరో ఆలోచన ఉండదని మన అధికారులు కుండబద్దలు కొడుతున్నా- ఇంకా కొందరిలో ఎందుకో అనుమానాలు తొలగిపోవడం లేదు. *

వీరాజీయం..... సెల్: 92900 99512