అంతర్జాతీయం

60ఏళ్ల తర్వాత నలందాకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 15: నలంద బుద్ధుడు తిరిగి చేరుకుంటారు. 60 ఏళ్ల క్రితం బిహార్‌లోని నలందా ఆర్కియాలజీ మ్యూజియంలోని బుద్ధుడి విగ్రహం చోరీకి గురైంది. ఖండాంతరాలు దాటి చివరకు లండన్‌కు చేరుకుంది. లండన్‌లోని ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన ఒక కళాఖండాల ప్రదర్శనలో ఈ బుద్ధుడి విగ్రహం ప్రత్యక్షమైంది. దీంతో లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు రంగంలోకి దిగారు. ఒక ఇన్‌ఫార్మర్ భారత్‌లో చోరీకి గురైన బుద్ధుడి విగ్రహం ప్రదర్శనలో ఉందని లండన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, స్కాట్ లాండ్ యార్కు పోలీసులు ఈ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహాన్నిస్వాధీనం చేసుకోవడానికి లిండా కళాఖండాల చౌర్య నిరోధక సంస్థ, ఇండియా ప్రైడ్ ప్రాజెక్టు ప్రతినిధి విజయ్ కుమార్ పోలీసులకు సహకరించారు. ఈ విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని లండన్‌లోని భారత్ హైకమిషననర్ వైకె సిన్హా కార్యాలయానికి న్యాయ ప్రక్రియ పూర్తయిన తర్వాత లండన్ డిటెక్టివ్ చీఫ్ ఇనెస్ప్టెర్ షీలాస్టీవార్డ్ అప్పగించారు. నలందాలో 1961లో 14 కళాఖండాలు చోరీ అయ్యాయి. అందులో అపురూపమైన బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇది మర్చిపోలేని కానుక అని భారత్ హైకమిషర్ కార్యాలయం పేర్కొంది. త్వరలో బీహార్‌లోని నలందా ఆర్కియాలజీ మ్యూజియంకు ఈ విగ్రహాన్ని తరలించనున్నారు.