పఠనీయం

నేతన్న బతుకు వెతల చిత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెమలికన్ను చీర
(చేనేత కథల సంకలనం)
-రాచపూటి రమేష్
వెల: రూ.90
ప్రతులకు: నవచేతన
పబ్లిషింగ్ హౌస్
నవచేతన బుక్‌హౌస్
*
‘నెమలికన్ను చీర’ కథాసంకలన రచయిత రాచపూటి రమేష్ - చేనేత జౌళి శాఖలో అభివృద్ధి అధికారిగా పని చేస్తున్నారు. తన అనుభవాలే కథలుగా మలిచి ఈ చేనేత కథల సంకలనం వెలుగులోకి తెచ్చారు. వందకు పైగా కథలు, నవలలు రాసిన రమేష్ తన పాతికేళ్ల జౌళి శాఖ అనుభవం రంగరించి రాశారు కనుక ఇవన్నీ అతి సహజంగా సాఫీగా నడుస్తాయి. అమాయకులైన నేతన్నలు చిక్కుదారపు వలయాల మధ్య చిక్కుకున్న వారి బ్రతుకులను అతి సహజంగా చిత్రీకరించాడు.
వర్షాలు తుఫానుల మధ్య చేనేత కార్మికులు ఎదుర్కొనే సమస్యలు (ముసురు), స్వంత ఇల్లు ఏర్పరచుకోవటంలో నేతన్న పడే ఇబ్బందులు (సాలెగూడు), నేత కళాకారుడికి దక్కాల్సిన గౌరవం దక్కకపోవటం (నెమలికన్ను చీర), మార్కెట్ ధరవరలు తెలియని నారాయణ ఆత్మహత్య ప్రయత్నం, పులిమేక ఆట లాంటి ఆటలో బలియై పోతున్న చేనేత పరిశ్రమ, చేనేత రంగంలో నెలకొన్న సంక్షోభం (వలయం) - వీటన్నింటి నుండి, పక్కా ప్రణాళికతో బయటపడవచ్చునని చెప్పే (ఆదిశక్తి) కథ.
పాఠకుల మనసు ద్రవీకరింపచేసి, క్షణంపాటు ఆగి, ఇందులో వివరించబడిన బాధలు, వ్యథల గురించి ఆలోచింపజేసే కథలు. లోగడ ప్రముఖ పత్రికలలో ప్రచురించబడి సంకలన రూపంగా వచ్చిన కథలు.
‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు’ అన్నట్లు - ప్రపంచీకరణను ఎదుర్కోక తప్పదు. ప్రపంచీకరణకు బలియై ఆక్రోశించే బదులు, దానికి అనుగుణంగా మారక తప్పదు. ప్రభుత్వం అందించే పథకాల సాయంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని, బ్రతకగలగటం నేర్చుకోవాలి.

-కూర చిదంబరం 8639338675