Others

నాకు నచ్చిన సినిమా--అమ్మాయిల శపథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తి, పురుషుల్లో అనుమానాలు, అపోహలు అవమానాలకు తావుండరాదని తెలియజెప్పే చిత్రమిది. ఆ రోజుల్లోనే మహిళా చిత్రంగా సూపర్ డూపర్ హిట్‌కొట్టింది అమ్మాయిల శపథం. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. సత్యనారాయణ, కాంతారావు, రామకృష్ణ, చంద్రమోహన్, లక్ష్మి, చంద్రకళ, అల్లు రామలింగయ్య, రావి కొండలరావు తమ పాత్రల్లో జీవించారు. ఆత్రేయ కలం నుండి వచ్చిన పాటలన్నీ హిట్టే.
సముద్రాల జూనియర్ మాటలు చక్కగా పలికించారు. కెమెరా పనితనం, లొకేషన్లు అందంగా చూపించింది. కాంట్రాక్టర్ గోపాలరావు తన ఇద్దరు కొడుకులను పెంచి పెద్ద చేస్తాడు. అతనిదగ్గర పనిచేసే మేనేజర్ సత్యంను ఓ కేసులో ఇరికించి, తన తప్పును కప్పిపుచ్చుకుంటాడు. ఇది తెలిసిన అతని కూతుళ్లు గీత, చిత్ర తన తండ్రిని అనవసరంగా జైల్లో వేశారని శపథం చేస్తారు. గోపాలరావు కొడుకులు సుందరం, కుమార్లను వాళ్ల ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుంటారు. గోపాలరావుకి బుద్ధి చెప్పాలని కక్షగట్టి పథకంతో అతని ఇంటికి కోడళ్లుగా వెళ్తారు. చివరికి మామ చేత క్షమాపణ చెప్పిస్తారు. మేనేజర్ తిరిగి రావడంతో అందరూ ఆశ్చర్యపోతారు. తన తప్పు తెలుసుకుని సత్యంను చేరదీస్తాడు జమీందారు. ఆస్తిపాస్తులు అప్పగించి హాయిగా వెళ్లిపోతాడు.
ఈ సినిమాలో సన్నివేశాలన్నీ రక్తికట్టించేలా జివిఆర్ శేషగిరిరావు చిత్రీకరించారు.
విజయ్‌భాస్కర్ సంగీతంలో పాటలన్నీ మధురంగా ఉంటాయి. ‘నీలిమేఘమా.. జాలి చూపుమా..’ బాలు, వాణీ జయరామ్‌ల గొంతనుంచి వచ్చిన మంచి మాట. ‘నా వయసు ఉరికినది.. నీ మనసు మురిసినది..’ వినసొంపుగా ఉంటుంది. చక్కని కుటుంబ కథా కాలక్షేప చిత్రమిది.

-సిహెచ్ విజయ్‌కుమార్, లింగంపల్లి