అంతర్జాతీయం

కొత్త నేర శిక్షాస్మృతిపై నేపాల్ మీడియా ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మాండు, ఆగస్టు 17: నేపాల్‌లో అధికారంలో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నేర శిక్షా స్మృతిపై మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. నేపాల్ ప్రభుత్వం కొత్త ఐపీసీని ప్రవేశపెట్టింది. దీని ఫ్రకారం గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ప్రచురించినా, ఆడియో రికార్డు చేసినా, అనుమతిలేకుండా ఫోటోలు తీసినా జైలుకు వెళ్లక తప్పదు. పత్రికా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం ఆంక్షలు విధించిందంటూ మీడియా ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త చట్టంపై మీడియాతో పాటు న్యాయవాదులు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించే వార్తలు రాసిన, టీవీలో ప్రసారం చేసినా మూడేళ్ల జైలు విధించే నిబంధనలను ఐపీసీలో చేర్చారు. కొత్త ఐపీసీ శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. అనుమతి లేకుండా ఫోటోలు తీసినా, వాయిస్‌ను రికార్డు చేసినా, ఈ వాయిస్‌ను విన్నా కూడా ఒక ఏడాది జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమానాను విధిస్తారు. ఈ కొత్త నిబంధనల వల్ల పరిశోధనాత్మక జర్నలిజం ఉండదని, పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీనియర్ న్యాయవాది దినేష్ త్రిపాఠీ తెలిపారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తామని, ఆందోళన ఉధృతం చేస్తామని నేపాల్ ప్రెస్ యూనియన్ అధ్యక్షుడు బద్రి సిగ్దాల్ చెప్పారు. ప్రజలు, పత్రికల హక్కును కాలరాచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. 2005లో నేపాల్ రాజు జ్ఞానేంద్ర కూడా ఇటువంటి నిబంధనలను ప్రవేశపెట్టడం వల్లనే పతనమయ్యారు.