Others

నియమ నిష్ఠలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ పనికైనా నియమాలు నిష్ఠలు తప్పనిసరి. అది ఆధ్యాత్మికమైనా, లౌకికమైనా ఒక ప్రణాళికతో పనిచేస్తే ఆ పని సులువుగా జరిగిపోతుంది. ఆధ్యాత్మిక ప్రదేశంలో ఇంతకుముందు మనం చేయాలనుకొన్న పనిని చేసినవారు కొన్ని నియమాలు ఏర్పాటు చేసి ఉంటారు. వాటిని తరువాతి భక్తులు అనుసరిస్తుంటారు. పెద్దవాళ్లు చేసారు. నేను అట్లానే చేస్తున్నాను అని చెబుతుంటారు. అట్లానే ఏ దేవాలయానికైనా వెళ్లితే అక్కడ కొన్ని నియమాలు ఏర్పాటు చేస్తారు. స్థలపురాణం దృష్ట్యా లేక ఆ భగవంతుడు చూపిన మార్గమో ఏదో ఒకటి ఆ దేవాలయానికికొన్ని నియమాలు పెట్టి వాటిని ఆచరించమని చెబుతుంటారు. భక్తుల సౌకర్యార్థమో వారి ఆధ్యాత్మిక పథంలో ముందుకు వెళ్లడానికో వారు ఆ నియమాలను పాటిస్తుంటారు. మనకు శబరి యాత్రలో లేదా అమ్మవారి దీక్ష పూనిన వారు ఈనియమాలను పాటించడం కనిపిస్తుంది. వారికి ప్రత్యేకమైన దుస్తులు ఉంటాయ. వారి దినచర్యలో కూడా ప్రతిరోజు తెల్లవారు జాముననే నిద్రలేచి చన్నీటి స్నానం, నుదుట విభూది చందనం కుంకుమలను ధరించడం, దీపారాధన చేసి అయ్యప్ప స్వామికి పూజ చేయడం, సత్యధారణ చేయడం, పురాణాలు వినడం, పాదరక్షలు వేసుకోకపోవడం, అన్నదానాల్లాంటివి చేయడం ఇవన్నీ వారు పాటిస్తుంటారు. వీటి అన్నింటికన్నా కూడా ఇతరులకు హాని చేయకుండా ఉండడం, పరుల సొమ్ముకు ఆశపడకుండా ఉండడడం, దానం, త్యాగం వాటి పట్లఅప్రమత్తతో ఉండడం లాంటివి చేయడం ఉత్తమం. మానవత్వంతో మెలగడమే చాలా ఉత్తమమని ఆధ్యాత్మిక వేత్తలు అంటారు. భగవంతుడెప్పుడూ ఎంత నిష్ఠగా ఉన్నాడన్న దానికన్నా ఎంత నీతినియమాలతో సత్యధర్మాలను పాటిస్తున్నాడన్న విషయానికి ప్రాధాన్యం ఇస్తాడట. అందుకే భక్తులంతా పరుల్లో పరమాత్మను చూసే నేర్పును పొందడానికి ఇష్టపడుతుంటారు.
*