అంతర్జాతీయం

కదిలిన దుబాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఆగస్టు 19: దుబాయ్‌లో స్థిరపడిన కేరళ వ్యాపారులు కేరళలో వరద బాధితులను ఆదుకునేందుకు రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. గల్ఫ్‌దేశాల్లో లక్షలాది మంది కేరళ ప్రజలు జీవనోపాధి నిమిత్తం ఉద్యోగాలు చేస్తున్నారు. కేరళలో ప్రకృతి విలయతాండవంపై వస్తున్న వార్తలు ఇక్కడి ప్రజలను కలచివేస్తున్నాయి. కేరళకు చెందిన వ్యాపార వేత్త యూసుఫ్ అలీ అనే వ్యక్తి రూ.50 మిలియన్లను విరాళంగా ప్రకటించారు. ఈ వివరాలను ఖలేజా టైమ్స్ అనే పత్రిక ప్రకటించింది. ఫాతీమా హెల్త్‌కేర్ గ్రూప్‌కు చెందిన కేపీ హుస్సేన్ రూ.50 మిలియన్లను ప్రకటించారు. ఇందులో పదిమిలియన్ల రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. మిగిలిన నిధులను వైద్య సహాయం కింద ఖర్చుపెట్టనున్నట్లు చెప్పారు. కేరళ వైద్య శాఖ కార్యదర్శితో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టే విషయమై ప్రణాళికను ఖరారు చేస్తామన్నారు. వర్షాలు, వరదలు ఆగిన తర్వాత, నీటిని తొలగించిన తర్వాత కాని మొత్తం మరణాల సంఖ్య బయటకు రాదన్నారు. కేరళలో బాధితులకు అవసరమైన మందులను కొనుగోలు చేసి దుబాయ్ నుంచి పంపిస్తున్నట్లు చెప్పారు. యుఏఇ ఎక్స్ఛేంజీ చైర్మన్ బీఆర్ శెట్టి మాట్లాడుతూ రూ.20 మిలియన్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
భారతీయ వైద్యుడు అజాద్ మూపెన్ కూడా రూ.5 మిలియన్లను విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. యుఏఈ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అలీ కూడా ఔదర్యంతో స్పందించారు. కేరళ ప్రజలను ఆదుకునేందుకు సహాయక చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. దుబాయ్‌లో భారత్‌కు చెందిన వారు 2.6 మిలియన్ల మంది నివసిస్తున్నారు. కష్టకాలంలో కేరళ ప్రజలను ఆదుకునేందుకు ప్రాంతాలకు అతీతంగా ఇక్కడి ప్రజలు స్పందిస్తున్నారు.