Others

వేదగిరి రాంబాబు మృతి తీరని లోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నివాళి

వేదగిరి రాంబాబు సముద్రం లాంటివాడు. బహుముఖీన ప్రజ్ఞావంతుడు - ఆ ‘సముద్రం’లో అలలు తగ్గవు.. తపన తగ్గదు.. అన్నట్లు కొనసాగించాడు. అతనిదో మహా అక్షరరమ్య యాత్ర. అతని నిర్విరామ అక్షర వ్యవసాయంలో విరామ చిహ్నాలు లేకుండా సాగింది. ఆశ్చర్యార్థకాలు బొలెడు!
క్రికెట్ బ్యాటింగులో ఎనభైలు తొంబైలు కొట్టినవాళళు సెంచరీ చెయ్యకుండా స్లిప్పుల్లో లదొరికిపోతారేమోగాని బాబు తాను ఎంచుకున్న సాహితీ ప్రక్రియలన్నింటా - మధ్యలో అవుట్ అయపోకుండా నిలదొక్కుకున్నాడు. సృజన రంగంలోనూ, నిర్మాణాత్మక రచనా రంగంలోనూ, ప్రచురణ రంగంలోనూ అటువంటి ఘనత సాధించి- నాట్‌అవుట్ బ్యాట్స్‌మ్యాన్‌గా - క్రీజులో, ఫీల్డులో అల్‌రౌండర్‌గా నిలదొక్కుకున్నాడు కానీ అనారోగ్యానికి లొంగిపోయాడు. అతని మరణం తెనుగు కథా సరస్వతికి కడుపు కోత.. చిన్న కథారంగానికి తీరని లోటు.
అతని ‘చిరుకప్ప దశ’ నుంచి నేను ఎరుగుదును. సముద్రం కథానికకి దీపావళి ఆంధ్ర సచిత్ర వారపత్రికలో బహుమతి లభించింది. అదొక ప్రారంభం మాత్రమే కాదు అదొక మలుపు కూడాను. రాంబాబుని నేను వాత్సల్యంగా బాబు - అని పిలవడానికే అలవాటుపడ్డాను. బాబు పిన్నవయస్సులోనే పెద్దకుండకి ఎసరుపెట్టి.. కమ్మని వంటలు చేశాడు. పంటలు పండించుకున్నాడు. యువకుడిగా అందంగా నొక్కు నొక్కు చక్కని క్రాఫింగుతో పూర్ణచంద్ర బింబవదనుడై - చకచక నడుస్తూ ముందుకే సాగే ఉత్సాహవంతుడు.. యువకుడు. హాయిగా యే అమ్మాయిల కాలేజీకో పోయి ఫీచర్స్ చెయ్యచ్చును కాని మనవాడు సెంట్రల్ జైలులోకి కలం పట్టుకొని వెళ్ళాడు. సంఘసేవ, సాహిత్య సేవ కలగలిపి ఎంచుకున్నాడు. నేరస్తులకు అమ్మతనం పంచాడు. రాష్ట్రంలోని అన్ని జైళలూ తిరిగి సేకరించిన సమాచారంతోపాటు ఖైదీలతో ముఖాముఖిని శ్రమకి ఓర్చి పట్టుదలతో సాధించాడు. నేరస్తుల మనోగత భావాల్ని సానుభూతితో ఆర్ద్ర హృదయంతో చిత్రీకరిస్తూ ‘జైలు గోడలు మధ్య’లో అన్న పరిశోధనాత్మక రచన చేశాడు. హైదరాబాద్ నగర చరిత్రని నాలుగొందల సంవత్సరాల విశేషాల్ని అద్భుతంగా మలచి గ్రంథం రాశాడు. ఓ గ్రంథంగా ఏర్చికూర్చాడు.
చాలా ఎత్తుకు ఎక్కి- జీవితంలోనూ, సాహిత్యంలోనూ అదే ఔన్నత్యాన్ని అందుకుంటూ - వేదగిరి - ఒక అపురూప ‘గిరి’ అయనాడు. కమ్యూనికేషన్స్ రంగంలో అతని సంస్థ కొత్త పుంతలు త్రొక్కింది. దృశ్య ప్రక్రియలో నంది అవార్డుల దొంతి సాధించాడు. ఎన్నో మొమెంటోలు అతని ఇంటినిండా. జర్నలిజంలో డాక్టరేటు అందుకున్నాడు. టీవీ రాకముందు రేడియో టాక్స్ సెక్షన్‌లో రాంబాబుకి అప్పటికే పెద్దపీట లభించింది. చిన్నకథల పెద్దమేస్ర్తీలు - గురజాడ, శ్రీపాద మొదలు బుచ్చిబాబు, పాలగుమ్మి వరకూ ఎందరో మహానుబావుల జేగీయమానమయన కృషిని - మళ్లీ వెలికితీసి ‘షో కేసు’ చేశాడు. శతాధిక గ్రంథాల ప్రచురణకర్తగా - ప్రకటించాడు.. రచించాడు. తెనుగు కథానికకు శతజయంతిని అనితర సాధ్యంగా రాజకీయ వాసనలు లేకుండా నిర్వహించాడు. అనారోగ్యాన్ని లెక్కచెయ్యకుండా - కథానికకు అవిశ్రాంత సేవలు చేస్తూ రాష్టమ్రంతటా పర్యటించాడు. ఇవాళ అతను అలసి శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. అతని సేవలు, అతని రచనలు - ఆధునిక సాహితీ రంగంలో మైలురాళ్లుగా సదా నిలుస్తాయ. అతని కుటుంబానికి, శిష్యులకు నా ప్రగాఢ సానుభూతి.

--వీరాజీ ఫోన్: 9290099512