అంతర్జాతీయం

చర్చలకు మేం సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 20: ఇరుగుపొరుగు దేశాలతో శాంతియుత చర్చలకు తాము ఎల్లపుడూ సిద్ధమేనని పాకిస్తాన్ కొత్త విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో పాక్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో విదేశీ మంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా భారత్‌తో స్నేహసౌభ్రాత్వం వెల్లివిరియడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దీనిద్వారా ఎన్నో దీర్ఘకాలికమైన అపరిష్కృత సమస్యలకు మార్గం సుగమం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధికారంలో ఉన్నపుడు ఖురేషీ 2008 నుంచి 2011 వరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరించారు. 2008లోనే ముంబయిలో టెర్రిరిస్టు దాడులు జరిగాయి. ఆ సమయంలో ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచుకునేందుకు వీలుగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అభినందిస్తూ రాసిన లేఖను తాము స్వాగతిస్తున్నామని ఖురేషీ అన్నారు. ఇరు దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలపై సామరస్యపూర్వకంగా చర్చించేందుకు తాము భారత్‌తో స్నేహహస్తం కోసం ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఇరు దేశాలకు కాశ్మీరే ప్రధాన సమస్యగా ఉందని అంటూ దివంగత భారత మాజీ ప్రధాని ఆటల్ బిహారీ వాజపేయి లాహోర్, ఇస్లామాబాద్‌లలో పర్యటించిన సందర్భంగా పాకిస్తాన్‌తోపాటు, కాశ్మీర్ అంశంపై ప్రస్తావన వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
16 మందితో ఇమ్రాన్ కేబినెట్
పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని ప్రభుత్వంలో 21 సభ్యులు గల టీమ్‌లో 16 మంది సోమవారం కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఐదుగురు ప్రధానమంత్రికి సలహాదారులుగా వ్యవహరిస్తారు. పాక్ అధ్యక్షుడు మమూన్ హుస్సేన్ ఆధ్వర్యంలో కొత్త మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేశారు. వీరంతా రిటైర్డ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ ప్రధానిగా ఉన్న సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇమ్రాన్ ఖాన్ పాక్ 22వ ప్రధానమంత్రిగా శనివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సోమవారం కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన తొలిసారిగా ప్రధానమంత్రి కార్యాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం తీసుకోవాల్సిన వివిధ వ్యూహాత్మక అంశాలపై ఆయన చర్చించారు.