డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవశక్తులు! నవావరణాలు! నవ రాత్రులు! అనే సంప్రదాయాలు ఏర్పడ్డాయి.
శ్రీ చక్రంలో నవావరణల పేర్లు-
1. భూపురత్రయము= త్రైలోక్య మోహన చక్రము
2. షోడశదళ పద్మము= సర్వాశాపరిపూరక చక్రము
3. అషదళ పద్మము= సర్వసంక్షోభిణీ చక్రము
4. చతుర్దశారము= సర్వసౌభాగ్య చక్రము
5. బహర్దశారము= సర్వార్థసాధక చక్రము
6. అంతర్దశారము= సర్వరక్షాకార చక్రము
7. అష్టకోణము= సర్వరోగహర చక్రము
8. త్రికోణము= సర్వసిద్ధిప్రద చక్రము
9. బిందువు= సర్వానందమయ చక్రము
శ్రీ చక్రంలో వున్న మొత్తం త్రిభుజాల సంఖ్య 43, మొత్తం పద్మాలసంఖ్య 24, మొత్తం వృత్తాల సంఖ్య 7 (బిందువుతో కలిపి)
శ్రీ చక్రము - మానవ దేహము
ఇలా నవావరణాత్మకంగా వున్న శ్రీ చక్రానికీ, మానవ శరీరానికి, అభేదాన్ని అనుసంధానం చేయాలని శాస్త్రం చెపుతోంది.
దేహో దేవాలయః ప్రోక్తో
జీవోదేవస్సనాతనః
త్యజేదజ్ఞాన నిర్మాల్యం
సోహం భావేన పూజాయేత్‌॥
(దేహమే దేవాలయము. జీవుడే అక్కడి దేవుడు. అజ్ఞానమే నిర్మాల్యము. దాన్ని పరిహరించాలి. ఆ దేవుడే నేననే భావనే పూజ. ఆ భావనతోనే అర్చించాలి.)
అష్టాచక్రా నవద్వారా
దేవానాం పూర్వయోధ్యా
తస్యాగ్‌ం హిరణ్మయః కోశః
స్వర్గో లోకో జ్యోతిషావృతః॥ (యజుర్వేదం)
(ఒకానొక దేవ పురం వుంది. దానికి గల చక్రాలు ఎనిమిది. ద్వారాలు తొమ్మిది. దాన్ని గెలవటం కష్టం. ఆ నగరంలోగల కంగారుకోశమే జ్యోతిర్మయమైన స్వర్గలోకం.)
ఇలాంటి మంత్రాలన్నీ నిగూఢ సంకేతాలతో నిండి వున్నాయి. మనం ఇప్పుడు వైజ్ఞానిక దృష్టితో మాట్లాడుకుంటున్నాం కనుక, ఆధ్యాత్మిక విషయాలను అలా వుంచి, వైజ్ఞానిక దృష్టితో వీటి సమన్వయాన్ని పరిశీలిద్దాం.
శ్రీ చక్రపరంగా సమన్వయం:
శ్రీ చక్రంలో నవావరణలున్నాయని ఇందాకనే ప్రస్తావించుకొన్నాం. వాటి పేర్లు కూడా చెప్పుకున్నాం. వాటిలో బహిర్దశార, అంతర్దశారాలను కలిపేస్తే, అపుడు శ్రీ చక్రం అష్టాచక్రా అవుతుంది.
నవద్వారా అంటే నవత్రికోణాలు. శ్రీ చక్రంలో నాలుగు శివ త్రికోణాలు, ఐదు శక్తి త్రికోణాలు వుంటాయి. ఈ రెండూ కలిపితే మొత్తం తొమ్మిది త్రికోణాలు అవుతాయి. వాటినే నవద్వారాలుగా పై మంత్రం నిర్దేశిస్తోంది. శ్రీచక్రంలో తొమ్మిది త్రికోణాలు వుంటాయనే దానికి ప్రమాణంగా శంకర భగవత్పాదుల వారి సౌందర్య లహరిలోని ఈ క్రింది శ్లోకాన్ని మనం స్వీకరించవచ్చు.
శ్లో॥ చతుర్భి శ్రీకంఠైశ్శివ యువతిభిః పంచభిరపి
ప్రభిన్నాభిశ్శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః
చతుశ్శత్వారింశద్వసుదళ కలాశ్రత్రివల
త్రిరేఖాభిస్సార్థం తవ శరణ కోణాః పరిణతాః - సౌందర్యలహరి.
(తాత్పర్యము- తల్లీ! నీకు నిలయమైన శ్రీచక్రం- శివకోణాలు నాలుగు, శక్తి కోణాలు ఐదు, తొమ్మిది మూల ప్రకృతులు, అష్టదళ, షోడశదళ, త్రివలయ, భూపురత్రయాలతో- మొత్తం నలభై నాలుగు అంచులు కలది.
శ్రీ చక్రంలో త్రికోణ, అష్టకోణ, దశకోణద్వయ, చతుర్దశ కోణాలనే ఐదు శక్తి చక్రాలు; బిందు, అష్టదళ, షోడశదళ, చతురశ్రాలు అనే నాలుగు శివ చక్రాలు, ఇది నవచక్రాత్మకము. శివశక్తులు రెండూ కలసిన రూపము.)
ఇక శరీర పరంగా సమన్వయం చేసుకొంటే, శరీరంలోని షట్చక్రాలు, సహస్రారం, లంబికాగ్ర కమలం, వీటిని కలిపితే శరీరం అష్టాచక్రా ఔతుంది. ఇక శరీరంలోని నవరంధ్రాలే నవద్వారాలు. ఈ విధంగా అష్టాచక్రా నవద్వారా అనే మంత్రాన్ని శ్రీచక్రానికీ, శరీరానికీ కూడా సమన్వయించుకోవాలని పెద్దలు చెబుతున్నారు.
ఇక విజ్ఞాన శాస్తప్రరంగా పరిశీలిద్దాం: పై అనే రేషియో ఒకటుంది. దీని విలు 1.6180339...
ఈ పై రేషియో చాలా రకాల ఆర్గానిక్ బాడీస్‌లో కనిపిస్తుంది.
ఉదా: మనిషి వేళ్ళలో మొదటి ఎముక, రెండవ ఎముకల రేషియో : పై 1.618 రెండవ ఎముక, మూడవ ఎముకల రేషియో కూడా: పై 1.618 కాళ్ళ కీళ్ళ ఎముకల్లో కూడా ఈ రేషియో ఇలాగే వుంది. చిత్రమేమిటంటే- శ్రీచక్రంలో వున్న వృత్తాల వ్యాసార్థాల రేషియో కూడా పై- రేషియోలోనే ఉందని ప్రొఫెసర్ పీసపాటి వెంకట గోపాలకృష్ణమూర్తిగారు నిరూపించారు. ఇంకావుంది...

‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.

ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర.
0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి