జాతీయ వార్తలు

వాజపేయి పేరిట అధ్యయన పీఠాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 21: దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి పేరిట 13 యూనివర్సిటీల్లో అధ్యయన పీఠాలు ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంతివార్ మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. పదకొండు ప్రభుత్వ, రెండు ప్రైవేటు యూనివర్సిటీల్లో ఈ అధ్యయన పీఠాల ఏర్పాటుకు తమ ప్రభుత్వం 20 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆయా యూనివర్సిటీల్లో వాజపేయి జీవిత చరిత్రపై పరిశోధన చేసే విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందని ఆయన తెలిపారు. ఇదిలావుండగా, బీజేపీ రాష్ట్ర విభాగం బుధవారం ముంబయిలో వాజపేయికి ఘనంగా నివాళి అర్పించేందుకు వీలుగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్, బీజేపీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు రావ్‌సాహెబ్ దానే్వ చితాభస్మంతో కూడిన కలశాన్ని తీసుకుని హాజరుకానున్నారని ఆయన పేర్కొన్నారు. దక్షిణ ముంబయిలోని నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో ఈ చితాభస్మాన్ని ఉంచి వాజపేయికి ఘనంగా నివాళులు అర్పిస్తారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి కేవలం బీజేపీ నాయకులు, కార్యకర్తలకే కాకుండా ఇతర పార్టీలవారు కూడా హాజరై దివంగత నేత వాజపేయికి నివాళులు అర్పించవచ్చునని ఆయన సూచించారు. కాగా, దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి చితాభస్మాన్ని రాష్ట్రంలో గల 13 పట్టణాల్లోని 11 నదుల్లో కలుపుతామని ఆయన పేర్కొన్నారు.