క్రైమ్/లీగల్

అవినీతి నేతల విచారణకు ఏం చేస్తున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: రాజకీయపార్టీల నేతలపై ఉన్న అవినీతి కేసులను విచారించేందుకు ఇంతవరకు ఎన్ని ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారనే విషయమై నివేదిక ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ అంశంపై గత ఏడాది డిసెంబర్ 14వ తేదీన సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులను విచారించేందుకు 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని, ఈ ఏడాది మార్చి 1వ తేదీ నాటికి పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసు మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కోర్టుల ఏర్పాటు అంశంపై నివేదిక ఇవ్వాలని జస్టిస్ రంజన్ గగోయ్ ఆదేశించారు. వీటికి భౌగోళిక సరిహద్దులను ఖరారు చేయాలని కోరారు. ప్రత్యేక కోర్టులు ఇంతవరకు ఎన్ని ఏర్పాటు చేశారు? వీటి భౌగోళిక పరిధి ఖరారు చేశారా? ఒక్కో కోర్టుకు ఎన్నికేసులను కేటాయించారో తెలియచేయాలని కోర్టు పేర్కొంది. ఈ కేసును ఈ నెల 28వ తేదీన విచారిస్తామని, ఆ లోగా తాము కోరిన అంశాలపై నివేదిక ఇవ్వాలనికోర్టు పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు తరఫున ప్రతినిధి వాదనలు వినిపిస్తూ తమ పరిధిలో ఒక సెషన్స్, ఒక మెజిస్ట్రేట్ కోర్టును ఏర్పాటు చేశామన్నారు పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ వాదనలు వినిపిస్తూ, కేంద్రం ఇంతవరకు అఫిడవిట్ దాఖలుచేసినా, నివేదికలోని అంశాలను తెలియచేయలేదన్నారు. ఈ కేసులో కేంద్రం వెంటనే పిటిషనర్‌కు నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. కేంద్రం గతంలో సమర్పించిన అఫిడవిట్‌లో పూర్తి వివరాలు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది.