ఆంధ్రప్రదేశ్‌

వచ్చే నెలలో భారీగా ‘సంక్షేమం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 21: వివిధ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల కోసం ఉద్దేశించిన పథకాలను వచ్చేనెల మూడో వారంలో పెద్దఎత్తున ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, కాపు, మైనారిటీ వర్గాల సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆదరణ-2, పెళ్లికానుక, జగజ్జీవన్‌జ్యోతి, ఎన్టీఆర్ విదేశీ విద్య, ఎన్టీఆర్ ఉన్నత విద్య పథకాల కింద అర్హులైన వారందరికీ రూపొందించిన కార్యక్రమాలను అమలు చేసేందుకు జిల్లాలన్నింటిలో అధికారులను సన్నద్ధం చేయాలని సూచించారు. రజకులు, గీత కార్మికులు, నేత పనివార్లు, భవన నిర్మాణ కార్మికులు, వడ్రంగి, కుమ్మరి, కంసాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన లక్షలాది లబ్ధిదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి జీవన ప్రమాణాలను పెంచాలనే లక్ష్యంతో పథకాలకు రూపకల్పన జరిగిందని వివరించారు. కొన్ని బీసీ వర్గాల వారికి అందించే యూనిట్లలో సౌలభ్యం మేరకు మొత్తం యూనిట్ ఖర్చులో అవసరమైతే కొంత నగదు ఇవ్వాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. జగ్జీవన్‌జ్యోతి కింద 100 యూనిట్ల ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని సూచించారు. పథకం పై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, సాంఘికసంక్షేమశాఖ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి బి ఉదయలక్ష్మి, ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజాశంకర్, తదితరులు పాల్గొన్నారు.