వరంగల్

కేరళకు ఓరుగల్లు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 21: బీభత్సమైన ఎడతెరిలేకుండా కురిసిన వర్షాలు, వరదలతో కేరళ ప్రజలు అల్లాడి పోతున్నారు. హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. వేలాదిమంది కేరళ రాష్ట్ర ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆస్తి, ప్రాణ నష్టంతో సర్వం కొల్పోయి అపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. మానవత కోణంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు కేరళ బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావ డం, ఎవరికి తోచిన సహాయం వారు చేయడం విశేషం. మీకు మేము తోడున్నామంటూ అన్ని వర్గాల ప్రజలు నగదు, బియ్యం, దుస్తులు, వంటసామాగ్రితోపాటు అనేక విధాలుగా తమ కు తోచిన సహాయం చేస్తున్నారు. విరాళాల సేకరణకోసం ఏర్పాటు చేసిన కౌంటర్లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సహాయాన్ని అందజేస్తున్నా రు. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి లక్ష రూపాయలను విరాళంగా ప్రకటించారు. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తన నెల వేతనా న్ని విరాళంగా ప్రకటించారు. సివిల్ సప్లైస్ చైర్మెన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి ఐదువేల క్వింటాళ్ల బాయిల్డ్ బియ్యాన్ని కేరళ బాధితులకు పంపిస్తామని చెప్పారు. ప్రజలు మానవత దృక్పధం తో కేరళ వరద బాధితులకు సహా యం అందించుటకు ముందుకు రావ డం అభినందనీయమని అర్బన్ కలెక్టర్ అమ్రపాలి అన్నారు. మంగళవా రం వరంగల్ రైస్ మిల్లర్ల ఆసోసియోషన్ తరుపున కేరళ వరద బాధితులకు పంపించుటకు సిద్దం చేసిన 120 క్వింటాళ్ళ బియ్యంతో గల లారీని కలెక్టర్ సుబేదారి కలెక్టరేట్ వద్ద జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైస్ మిల్లర్ల అసోసియేషన్ 750 క్వింటాళ్ళ బియ్యం కేరళ బాధితులకు అందజేయుటకు ముందుకు రావటం మరువలేని సహాయంగా కొనియాడారు. రైస్ మిల్లర్ల అసోసియోషన్ అధ్యక్షులు తోట సంపత్, సెక్రటరీ ఎర్రబెల్లి వెంకటేశ్వరరావులను కలెక్టర్ అభినందించారు. వరంగల్ నుండి రెండు రోజుల్లో 750 క్వింటాళ్ళ బియ్యం బస్తాలను హైద్రాబాద్ సివిల్ సప్లై కమీషనర్‌కు అందజేయుటకు పంపించామని అన్నారు. హైద్రబాద్ నుండి నేరుగా కేరళకు తరలించడం జరుగుతుందని చెప్పారు. రెండు రోజులుగా వాణిజ్య, వ్యాపార వేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, విద్యాసంస్ధలు, విద్యార్ధులు అత్యధికంగా సాయం అందించుటకు ముందకు వస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్ల అసోసియోషన్ ప్రతినిధులు 75వేల రూపాయల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. సుబేదారిలోని కలెక్టరేట్, జులైవాడ కలెక్టరేట్, రెడ్‌క్రాస్ భవనం. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్‌లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి విరాళాలు స్వీకరిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ దయానంద్, డిఎస్‌వో విజయలక్ష్మి, సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు జగన్ పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండాలి
* అధికారులను ఆదేశించిన కలెక్టర్ అమెయ్‌కుమార్‌
మంగపేట, ఆగస్టు 21: గోదావరి నీటిమట్టం పెరుగుతున్న క్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి కలెక్టర్ డీ.అమెయ్‌కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర్‌ఘాట్ వద్ద గోదావరి నీటి మట్టాన్ని పరిశీలించిన కలెక్టర్ అమెయ్‌కుమార్ అక్కడ నుండి మంగపేటకు చేరుకున్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చక్రధర్‌రావు, ములుగు ఆర్డీఓ రమాదేవి, మం గపేట తహశీల్దార్ అంటి నాగరాజులతో కలిసి మంగపేట పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి వరద తీవ్రతను పరిశీలించారు. గోదావరి మరింత పెరిగితే లోతట్టు ప్రాం తాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాలని రెవెన్యూ అధికారులకు తెలిపారు. అనంతరం రాజుపేట - సంఘంపల్లి మధ్య ముసలమ్మ వాగు ఉదృతికి తెగిపోయిన రోడ్డును పరిశీలించారు. ఆయన వెం ట ఎంపీడీఓ భీంరెడ్డి రవీందర్ రెడ్డి, ఏటూరునాగారం సీఐ బీ.సత్యనారాయణ, మంగపేట ఎస్‌ఐ సీహెచ్.వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి చిరంజీవి, టీఆర్‌ఎస్ మండల నాయకులు హరిబాబు ఉన్నారు.

గోదావరి ఉగ్రరూపం
మహదేవపూర్, ఆగస్టు 21: మండలంలోని కాళేశ్వరంలోని గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో తీర ప్రాంతంలో నివసించే ప్రజలు ఇతర పనుల మీద వాగుల వద్దకు వెళ్లవద్దని తహశీల్ధార్ శ్రీనివాస్ తెలిపారు. ఎడతెరిపి లేకుండ కురుస్తున్న వర్షాలకు ఎగువనున్న ప్రాణహిత, ఇంద్రవతి నదులు ఉప్పోంగడంతో గోదావరి తీర ప్రాంతాలలోనివాసం ఉండే ప్రజలు తమ పనుల నిమిత్తం వాగు సమీపంలోకి వెళ్లకూడదని ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ నీరు ఎక్కువ కావడంతో కాళేశ్వరం వద్ద నీటి క్రమేపి పెరుగుతుందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.