వరంగల్

రోడ్డెక్కి పంతం నెగ్గించుకున్న అతివలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, ఆగస్టు 21: ఎట్టకేలకు మహిళల పోరుతో అయ్యగారిపల్లిలో అక్రమ మద్యం అమ్మకాలకు చెక్‌పడింది.గ్రామంలో అనధికార దాబాలు, బెల్టుషాపులు ఈ నెల 20 తరువాత నిర్వహిస్తే ప్రత్యక్ష పోరుకు దిగుతామని గ్రామానికి చెందిన మహిళలు ముందస్తుగా చేసిన ప్రతీఙ్ఞకు కట్టుబడి ఉన్నారు. మంగళవారం అన్నట్టుగా గ్రామంలో యదావిధిగా దాబాలు, బెల్టుషాపులు నిర్వహిస్తుండటంతో మహిళలు జట్టుగా ఏర్పడటంతో పాటు యువసేన యూత్ సభ్యులు తోడై దాబాల్లో వంట సామాగ్రిని చిందరవందర చేశారు. తొలుత పలు బెల్టుషాపుల్లోకి వెళ్లి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని, మళ్లీ మద్యం ఎందుకు విక్రయిస్తున్నారని మహిళలు బెల్టుషాపుల నిర్వాహకులతో వాధనకు దిగారు. అయితే అందులో ఒక బెల్టుషాపు నిర్వాహకులు మమ్మల్ని బందు బెట్టమని ఒత్తిడి తేవడం కాదు.. మీ ఇండ్లలో కూడా మందు తాగకుండా చూసుకోవాలని, బంధువులు వచ్చిన తాగించకూడదనడంతో ఇరు వర్గాల మద్య వివాదానికి దారితీసింది. దీనితో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు వచ్చి తక్షణం అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టుషాపులు, దాబాలను మూయించాలని డిమాండ్ చేస్తూ కేసముద్రం - తొర్రూర్ రహాదారిపై రాస్తారోకోకు దిగారు. దీనితో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో కొంద రు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో కేసముద్రం పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మహిళలతో బెల్టుషాపు నిర్వాహకులతో మాట్లాడారు. మేం ముం దుగానే అల్టీమేటం ఇచ్చినా పెడచెవిన పెట్టారని పోలీసుల ఎదుట నిరసనకు దిగా రు. దీనికి స్పందించిన పోలీసులు బెల్టుషాపులు, దాబాల నిర్వాహకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కొత్తగా ఏర్పడ్డ గ్రామంలో ఇక నుండి దాబాల్లో, బెల్టుషాపుల్లో మద్యం, గుడుంబా విక్రయించబోమని లిఖితపూర్వకంగా రాయించడంతో మహిళలు శాంతించారు.

కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ఏదీ?
* విద్యార్థులను మోసం చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం
* ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ స్టాలిన్
నర్సంపేట, ఆగస్టు 21: కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఆగస్టు 15 నుండి మధ్యాహ్నా భోజనం అందిస్తామని చెప్పిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను అమలు చేయకుండా విద్యార్థులను మోసం చేసిందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ స్టాలిన్ విమర్శించారు. ఏఐఎస్‌ఎఫ్ రూరల్ జిల్లా ప్రథమ మహాసభలు పట్టణంలోని వాసవీ కళ్యాణ మండపంలో దండెం సామ్రాట్ ప్రాంగంణంలో రూరల్ జిల్లా కన్వీనర్ దిడ్డి పార్ధసారథి అధ్యక్షతన మంగళవారం జరిగాయి. ఈమహాసభలకు ముఖ్య వక్తగా హాజరైన అశో క్ స్టాలిన్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించలేని నిస్సహా య స్థితిలో పాలకులు ఉండడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన కేజీ టూ పీజీ ఉచిత విద్య, ఆగస్టు 15 నుండి కళాశాలల విద్య్థాలకు మధ్యాహ్నా భోజనం అందిస్తామని చెప్పిన వాగ్ధానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభు త్వం నూతన విద్యావిధానం 2016ను తీసుకవచ్చి విద్యారంగంలో కాషాయికీరణ, యూజీసీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రైవేట్ యూనివర్సీటీల బిల్లుకు పచ్చజెండా ఊపడం దారుణమని అన్నారు. సీపీఐ రూరల్ జిల్లా కార్యదర్శి పంజాల రమేష్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై ఏఐఎస్‌ఎఫ్ కార్యకర్తలు నిరంతరం ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. తొలుత పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహం నుండి మహాసభలు జరిగే వాసవీ కళ్యాణ మండపం వరకు భారీ ప్రదర్శన జరిగింది. ఈమహాసభలలో ఆసంఘం అర్బన్ జిల్లా కార్యదర్శి నరేష్ ద్రవిడ్, రాష్ట్ర, జిల్లా నాయకులు అక్కపెల్లి రమేష్, కందిక చెన్న కేశవ్, హేమంత్, రవి, వంశీ, హరిక్రిష్ణ, శ్రీహరి, పరమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
* సీపీఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి విజయసారథి ఆరోపణ
మహబూబాబాద్, ఆగస్టు 21: బూటకమైన విధానాలు, నియంతృత్వ చర్యలతో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం పాలన సాగిస్తూందే తప్ప ప్రజా సమస్యల పరిష్కారంలో ఏలాంటి చొరవ చూపడం లేదని సీపీఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి విజయసారధి ఆరోపించారు. పాకాల ఏరు చెక్ డ్యాం కం రోడ్ వే ఎత్తు పెంపుదలతో పాటు, ఎన్నికల హామీలను అమలు చెయ్యటంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరీపై సీపీఐ గార్ల మండల శాఖ జిల్లా కేంద్రం వరకు తలపెట్టిన మహా పాదయాత్రను మంగళవారం స్థానిక నెహ్రూ సెంటరులో ఆయన ప్రారంభించి ప్రసంగిస్తూ పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రతి ఏడాది వర్షాకాలంలో గార్ల మండలం రాంపురం పంచాయతీతో పాటు డోర్నకల్, కొరవి, మహబూబాబాద్ మండలాలకు చెందిన గిరిజన ప్రజలు పాకాల ఏరు దాటలేక ఇబ్బందులు పడుతున్నారని, చెక్‌డ్యాం ఎత్తు పెంచాలని ప్రజ ల విజ్ఞప్తులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. పాకాల ఏరు రోడ్ వేకం చెక్‌డ్యాం ఎత్తు పెం పుకు కృషి చేస్తామని బీరాలు పలికిన ఇల్లందు నియోజక వర్గ శాసన సభ్యుడు కోరం కనకయ్య, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు ఆజ్మీరా సీతారాం నాయక్ సహితం పత్తా లేకుండ పోయారన్నారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు మాటలతో సరిపెడుతున్నా రే తప్ప సమస్యలపై తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి సంఘటిత ఉద్యమాలే శరణ్యమని పార్టీలకు అతీతం గా ప్రజలు పాలక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని విజయసారథి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ఏపూరి బ్రహ్మం, కట్టెబోయిన శ్రీనివాస్, మండల కార్యదర్శి పోతుల నర్సింహారావు, జంపాల వెంకన్న, పల్లా కోటి తదితరులు పాల్గొన్నారు. కాగా మహా పాదయాత్రకు కాంగ్రెస్, సీపీఎం, టీడీపీ, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు సంఘీభావం తెలిపారు.