వరంగల్

ప్రశాంతత, ఆహ్లాదాలకు నెలవు పద్మాక్షి గుట్టలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగల్, ఆగస్టు 21: భక్తుల కొం గు బంగారం, కోరిన మొక్కులు తీర్చే ప్రసిద్ధి గాంచిన భద్రకాళి అమ్మవారి దేవాలయం, పక్కనే ఉన్న భద్రకాళి చెరువును ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు. గుట్టల పైన ధనం బావి, గగ్గిలయ్య, గుహలో సాయిబాబా విగ్రహా లు అనాటి శిల్పుల కళా నైపుణ్యానికి నిలయాలుగా చెప్పుకోవచ్చు. గుట్టల మధ్యనుండి హన్మకొండ చౌరస్తా నుండి న్యూశాయంపేటకు వెళ్లే రహదారి ఉంటుంది. రహదారికి రెండువైపుల గుట్టలు విస్తరించి ఉన్నాయి. తూర్పు, పశ్చిమ దిక్కులలో ఉన్న గుట్టలపై బాగంలో పచ్చని పచ్చిక బయళ్లు, పండ్లు, పూలమొక్కలు, నీటి కొలనులు, ధనం బావి ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులనే కాకుండా విదేశీ, స్వదేశీ పర్యాటకులను అకర్షిస్తున్నా యి. గుట్టలపైకి వెళ్లడానికి వీలుగా మెట్లు కూడా ఏర్పాటు చేయడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. గుట్టలపైకి ఎక్కి చూస్తే వరంగల్ మహానగరం మొత్తం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాలనుండే కాకుం డా విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సుమారు ఏడుగుట్టలు కలిగిన ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా మార్చి, అభివృద్ది చేయాలనే తపనతో పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయబాస్కర్ గతంలో అనేక సార్లు రాష్ట్ర పర్యాటక, దేవాదాయ శాఖల మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని తన నిధులనుండి ఇప్పటికే భద్రకాళి చెరువు చుట్టూ ట్యాంక్‌బండ్‌ను నిర్మిస్తున్నారు. సంబంధిత శాఖల సహాకారంతో భద్రకాళి దేవాలయం చెరువునుండి తూర్పు వైపున ఉన్న గుట్టల మీదుగా రోడ్డు అవతలి వైపు పడమర దిక్కులో ఉన్న గుట్టల మీదికి స్కైవే ఏర్పాటు చేస్తే పర్యాటకుల తాకిడి పెరిగి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ప్రతిపాదనలు తయారు చేయించి ప్రభుత్వానికి అందజేసారు. భద్రకాళి దేవాలయం, చెరువు, గుట్టల విశిష్టతపై విస్తృత ప్రచారం నిర్వహించడంలో భాగంగా ఎమ్మెల్యే గతంలో స్వామిజీలను కూడా తీసుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
తాజాగా వెలుగులోకి వచ్చిన వీరగల్లు విగ్రహం
అగ్గలయ్య గుట్ట సమీపంలో ఉన్న మచిలి బజార్ ప్రాంతంలో గుట్టకి చెక్కిన పూరాతన విరగల్లు విగ్రహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. కంది కుమారస్వామి అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో వరంగల్ అర్బన్ జిల్లా టూరిజం కన్సల్టెంట్ అరవింద్ ఆర్య విగ్రహాన్ని పరిశీలించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పర్యాటక శాఖ ఇన్‌చార్జ్ అధికారి డియస్ జగన్ కలెక్టర్ అమ్రపాలికి పూర్తి వివరాలు నివేదించారు. స్పందించిన కలెక్టర్ విగ్రహానికి రక్షణగా పినిషింగ్ ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ శిల్పం వీరగల్లు యుద్దరంగంలోని దృశ్యం, వీరుని కుడిచేయి బొడ్లో ఉన్న కత్తిమీద ఉంది. అతని తలపై దేవతామూర్తి, ఎడమ కాలి పక్కన నిలిపిన ఆయుధం మీద ఎడమచేయి ఉంది. అతని తలమీద కొమ్ములుగా కనిపిస్తున్న విగ్రహాలంకరణలో భాగంగా చెక్కిన తోరణం ఉంది. వీరగల్లులో అంతస్తుల దృశ్యాలుంటాయని, ఇందులో అన్ని ఒకే దృశ్యంగా చెక్క బడ్డాయని. వీరుని ఆహార్యం రాజోచితమైన వేషధారణ కాబట్టి ఆ వీరుడు ఒక రాజు కావచ్చు. ఈ శిల్పం లభించిన ప్రాంతంలో గతంలో కాకతీయులకన్నా ముందు యుద్దాలు జరిగినట్టు చరిత్ర చెబుతున్నది. విగ్రహశైలి కూడా కాకతీయులకన్నా పూర్వందే, అక్కడేమైన శాసనం లభిస్తే చరిత్రకొక ఆధారం దొరికినట్టు అవుతుంది. హనుమద్గిరి జైనశిల్పాలు, జైనరామాల, జైన సల్లేఖ నవ్రతాల, జైన గుహలకు నిలయమే కాదు. రాచవీరుల చరిత్రకు అలవాలమని ఈ శిల్పం చాటుతున్నది.

ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం
* వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్
వరంగల్‌క్రైం, ఆగస్టు 21: నేరాలను నియంత్రించడంతోపాటు నేర రహిత కమిషనరేట్‌గా గుర్తింపు తీసుకురావడంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకు రావడం శుభ సూచికమని పోలీసు కమిషనర్ రవీందర్ అన్నారు. మంగళవారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన జిఆర్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఏజెన్సీ ప్రతినిధినికి సీపీ 60వేల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌జోన్ డీసీపీ వెంకట్‌రెడ్డి, హన్మకొండ ఏసీపీ రాజేంద్రప్రసాద్, సుబేదారి, కేయూ ఇన్‌స్పెక్టర్లు సదయ్య, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.