వరంగల్

చూపును ప్రసాదిస్తున్న కంటివెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రఘునాథపల్లి, ఆగస్టు 21: రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న కంటి వెలుగు పథకం ద్వారా చూపును ప్రసాదిస్తూ పేద ప్రజలకు తోడుగా నిలుస్తుందని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజ య్య అన్నారు. మండల కేంద్రంలో కంటి వెలుగు శిభిరాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో గ్రామంలోని ప్రతి కంటి దోషాలు న్న వ్యక్తికి పరీక్షించి తగిన చికిత్సలు అం దించాలన్నారు. ఇప్పటివరకు రఘునాథపల్లి మండల కేంద్రంలో 8 మందికి కంటిచికిత్సలు జరిపి అద్దాలను అందించడం జరిగిందని తెలిపారు. మండలంలోని 36 గ్రామాల్లో ప్రతి ఒక్కరిని పరిక్షించాలని ఆయన రైతులను సూచించారు. అవసరమైన వారికి పెద్ద ఆసుపత్రులకు సిఫారసు చేయాలని కోరారు. ప్రజలు కంటివెలుగును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు మారుజోడు రాంబాబు, కంటి వెలుగు ఇన్‌ఛార్జీ డా. వౌనిక, మాజీ ఎంపీపీ మారపాక రవి, నామాల బుచ్చయ్య, ద్యావర యాకయ్యలు ఉన్నారు.

మత్తడికి చేరువలో పాఖాల చెరువు
* గరిష్ట నీటి సామర్థ్యం 30 అడుగులకు అరడుగు మాత్రమే దూరం
నర్సంపేట, ఆగస్టు 21: నర్సంపేట డివిజన్‌లో గత వారం రోజుల నుండి జోరు వాన కురుస్తుండడంతో జలాశయాలన్ని నిండుకున్నాయి. చెరువులు, కుంటలన్నీ మత్తడి పరవళ్లు తొక్కుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద చెరువు అయిన పాఖాల వచ్చే ఇరవై నాలుగు గంటలలో గరిష్ట నీటి సామర్థ్యమైన 30 అడుగులకు చేరుకుని మత్తడి పడనుంది. అన్ని జలాశయాలకు సం వృద్దిగా వరద నీరు వచ్చి చేరుతోంది. చెరువు నీటి సామర్థ్యం 30 అడుగులు కాగా మంగళవారం సాయంత్రం నాటికి 29.4 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతం నుండి గణనీయంగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో బుధవారం సాయంత్రం వరకు మత్తడి పడే పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ పంటకు 21 అడుగులు ఉంటే ఉప కాల్వలకు సాగునీటిపారుదల శాఖ అధికారులు నీటిని వదులుతారు. పాఖాల చెరువు గరిష్ట నీటి సామర్థ్యం 30 అడుగులు. గత ఏడాది 26 అడుగులకు మాత్రమే చెరువులోకి నీరు వచ్చింది. 2016వ సంవత్సరంలో పాఖాల చెరువుత మత్తడి పోసింది. పాఖాల చెరువు గరిష్టి నీటి సామర్థ్యానికి నీరు చేరడంతో పాఖాల చెరువును చూసేందుకు పర్యాటకల సంఖ్య గత వారం రోజులుగా రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. అదే విధంగా నర్సంపేట మండలంలోని మాధన్నపేట చెరువు గత నాలుగు రోజుల నుండి ఉదృతంగా మత్తడి పోస్తోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిన్న, మద్యతరహా చెరువులన్ని జలకళతో మత్తడి పరవళ్లు తొక్కుతున్నాయి. ఇదే సమయంలో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. డివిజన్‌లో ముమ్మరంగా వరినాట్లు పడుతున్నాయి. ఇక ఖరీఫ్, రబీ రెండు పంటలకు ఢోకా లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో మరిన్ని వర్షాలు రాబోయే రోజుల్లో పడితే అతి వృష్టి ఏర్పడే అవకాశం లేదని రైతులలో ఆందోళన సైతం నెలకొంది.

27న చలో హైదరాబాద్ తరలిరండి
* అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ
వడ్డేపల్లి, ఆగస్టు21: 2011 భూ ఆధీకృత సాగుదారుల చట్టం అమలు చేయాలని అఖిలభారత రైతాంగ పోరాట సమన్వయ కమిటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో వాస్తవ సాగుదారుల సమస్యలపై ఈ నెల 27న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోజరిగే సదస్సు గోడ పత్రికను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన రైతుబందు పథకం డబ్బులను బడావ్యాపార వేత్తలకు, ధన భూస్వాములకు రెవెన్యూ అధికారులే స్వయంగా వారి ఇండ్లలోకి వెల్లి రైతుబందు చెక్కులను ఇస్తున్నారని ఆరోపించారు. దేవాదాయ భూములు, వక్ఫ్‌బోర్డు భూములు సాగుచేస్తున్న పేద రైతులకు కూడ రైతుబందు పథకం వర్తించలేదని తెలిపారు. రైతు ఆత్మహత్యలలో 75 శాతం కౌలు రైతులేనని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కౌలు, పాలు, పోడు రైతులకు రుణ ఆర్హత కార్డులివ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వెంకటనారాయణ, చందర్‌రావు, భీరం రాములు, ఇంద్రసేనారెడ్డి, బాలరాజు, రమేష్, రాజయ్య, శంకరయ్య పాల్గొన్నారు.